నటి హేమకు షోకాజ్‌ నోటీసు

నటి హేమకు షోకాజ్‌ నోటీసు

నటి హేమకు షోకాజ్‌ నోటీసు

‘మా’ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నానంటూ ప్రకటించిన నటి హేమకు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ నిధులు దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తన సభ్యులతో హేమ మాట్లాడిన వాయిస్ రికార్డ్  మీడియాలో వచ్చిన వార్తలు మా సభ్యులలో ఆందోళన కలిగించాయి. అయితే ఇదే విషయంపై అగ్రనేతల వరకు చేరాయి. అయితే ఇదే విషయం పై ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌, కార్యదర్శి జీవిత ఖండించారు. హేమ బాధ్యతారహితంగా మాట్లాడి ‘మా’ ప్రతిష్ట దిగజారేలా చేసిందని క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేయగా ఇదే క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఆధారాలతో హేమ మాట్లాడిన వాయిస్‌ను క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షుడు నరేశ్ సమర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హేమపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

మూడు రోజుల్లో హేమ నుంచి సమాధానం రావాలని, అది సంతృప్తికరంగా ఉండాలని డీఆర్‌సీ తెలిపింది. లేని పక్షంలో క్రమశిక్షణా సంఘం నుంచి కఠిన చర్యలు తప్పవని తెలిపింది.

అయితే ఇదే క్రమంలో ‘మా’ అసోసియేషన్‌ ఎన్నికలపై  చిరంజీవి కూడా స్పందించారు. ‘మా’ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు వెంటనే జరపాలనీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు.

అయితే హేమపై చర్యలు తీసుకోవాలని చూస్తోంది కూడా..  అయితే  ‘మా’ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు. మా ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *