నా తదుపరి సినిమా థియేటర్ లో రాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తా….!

నా తదుపరి సినిమా థియేటర్ లో రాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తా….!

నా తదుపరి సినిమా థియేటర్ లో రాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తా….!

నా సినిమాలు నిలిపేస్తారని తెలిస్తే.. తన సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తానని టాలీవుడ్ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం “టక్ జగదీష్ ట్రైలర్” విడుదల సందర్బంగా న్యాచరుల్ స్టార్ నానీ ఈ కామెంట్స్ నవ్వుతూ చెప్పారు. నాని మాట్లాడుతూ.. టక్ జగదీష్ థియేటర్లలో  విడుదల కాకపోవడంపై  నాకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విడుదల విషయంలో నన్ను బయటి వాడిలా చూడటం బాధ కలిగించింది. కరోనా తరువాత థియేటర్లు ఓపెన్ అయినా.. నా సినిమాను థియేటర్లకు తీసుకెళ్లకుండా.. ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు..“ నన్ను నేనే బ్యాన్ చేసుకుంటానని” నేచురల్ స్టార్ నాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఈ సినిమాను ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టక్ జగదీష్ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన నాని ఈ సంచలన ప్రకటన చేయడం ప్రేక్షకులకు, అభిమానులకు కొంత బాధ కలిగించిందనే చెప్పాలి.

అయితే కొద్దిరోజులుగా టక్ జగదీష్ ను థియేటర్లోనే విడుదల చేయాలనీ నానీ గట్టిగానే ప్రయత్నాలు చేశారు. చివరకు నిర్మాతల అభిప్రాయానికే వ్యాల్వు ఇవ్వడంతో పాటుగా.. డిస్టిబ్యూటర్లకు కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై తన అభిప్రాయం చెప్పడంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ప్రకంపనలు వచ్చాయని చెప్పొచ్చు. దీనిపై అభిమాన సంగాలు కొంత ఆందోళన పైకి చెప్పకుండా బాధపడుతున్నారని గుసగుసలొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *