దేశ వ్యాప్తంగా హెటిరో డ్రగ్స్ పై కొనసాగుతున్న ఐటీ దాడులు

దేశ వ్యాప్తంగా హెటిరో డ్రగ్స్ పై కొనసాగుతున్న ఐటీ దాడులు

దేశ వ్యాప్తంగా హెటిరో డ్రగ్స్ పై కొనసాగుతున్న ఐటీ దాడులు

రాష్ట్ర వ్యాప్తంగా హెటిరో డ్రగ్స్ సంస్థలపై 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఐటీశాఖ ఆయా రాష్ట్రాల్లో  తనిఖీలు చేయగా రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఇతర దేశాలకు హెటిరో భారీగా మందులు ఎగుమతి చేసిందని ఐటీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ సంస్థ అగ్రదేశాలైన అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందులను టాక్స్ ఎగొట్టి ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. ఐటీశాఖ సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరుగుతున్నాయన్న సమాచారంతో కొన్ని కీలక ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు ఐటీశాఖ తెలిపినట్లు సమాచారం. చాలా వరకు నకిలీ ఇన్వాస్‌లు తయారు చేసి విదేశాలకు మందులను తరలించినట్లు గుర్తించారు. ఇది ఇలా ఉండగా హెటిరో కంపెనీ.. డబ్బులతో హెటిరో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసింది.16 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. రూ.142 కోట్ల నగదు, భారీగా బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరో రూ.550 కోట్ల నగదు నిల్వలు లెక్కతేలాల్సి ఉందని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: