15ఏళ్లు దాటిన పాత కారు ఉందా? అయితే 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే మరీ!

15ఏళ్లు దాటిన పాత కారు ఉందా? అయితే 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే మరీ!

కాలం చెల్లిన పాత కార్లు పక్కన పెట్టాల్సిందే..లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మీ దగ్గర పాత కారు ఉందా? 15ఏళ్లు పైబడిందా.? అయితే ఆ కారుకు 8 రెట్లు ఫీజు చెల్లించాల్సిందే మరీ.. కాలం చెల్లిన కార్లకు మళ్లీ రెన్యువల్ చేయించుకోవాలంటే.. ఆర్టీఏ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. కాలం చెల్లిన వాహనాలను పక్కనపెట్టి కొత్త వాహనాల కొనుగోళ్లకు కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో పాటుగా ఆయా రాష్ట్రాల్లో సబ్సిడీలతో పాటుగా పాత కారు ఇచ్చే వారికి కూడా రాయితీని ఇచ్చేందుకు వీలుగా మెసులుబాటు కేంద్రం కల్పించింది. దీనిలో భాగంగానే 15ఏళ్లు దాటిన పాత కార్లపై భారీ ఫీజులను వసూలు చేయమని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు అమల్లోకి రానున్నాయి.

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం. ఈ నిర్ణయంతో కమర్షియల్ వెహికల్స్ ఓనర్లు ట్రక్స్, బస్సుల ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ రెన్యువల్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలోనూ దాదాపు 8 రెట్లు వరకు అధిక ఛార్జీలు చెల్లించాల్సిందే. ఈ మేర‌కు 4-10-2021న కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో మాత్రం 10 ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాలు, 15ఏళ్లు దాటిన పెట్రోల్ వాహ‌నాల య‌జ‌మానుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు..ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లోని ఆయా వాహనాలపై నిషేధం విధించారు.

పెంచిన రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు: ప్ర‌స్తుతం 15ఏళ్లు దాటిన‌ రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ ఫీజు రూ.600గా ఉండగా.. పెంచబోయే ఛార్జీలతో రూ.5వేల వరకు చెల్లించాలి. పాత బైక్‌ల రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చార్జీలు రూ.300 నుంచి రూ.1,000 వరకు ఉండగా..  15 ఏళ్లు దాటిన బ‌స్, ట్ర‌క్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ పొందాలంటే ఇప్పుడు రూ.1500 చెల్లించాల్సిందే. నిబంధనల ప్రకారం 2022, ఏప్రిల్ నుంచి మాత్రం రూ.12,500 చెల్లిస్తేనే…అప్పుడు మాత్రమే ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ జారీ చేస్తారు.రిజిస్ట్రేష‌న్ చేయించుకోవడం పొరబాటున ఆలస్యమైతే మాత్రం రోజువారీ నుంచి నెలలవారీగా ఆర్టీఏ రూల్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చేయించుకోవడం ఆలస్యమైతే ఆ వాహనాల యజమానులు నెల‌కు రూ.300 వరకు ఫీజు చెల్లించాలి. అదే క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్‌కు మాత్రం రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్‌లో ఆలస్యమైతే..రోజుకు రూ.50 జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాత వాహ‌నాల‌కు ప్ర‌తి ఐదేళ్లకు ఒకసారి రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చేయించుకోవడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం 8 ఏళ్లు దాటిన వాణిజ్య, క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల‌కు ప్రతి ఏడాది ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌ తీసుకోవాలి. వాహ‌నాల‌కు మాన్యువ‌ల్ అండ్ ఆటోమేటెడ్ ఫిట్ టెస్ట్‌ చేయించుకోవాలన్నా ఫీజు చెల్లించాల్సిందేనని కేంద్రం రూల్స్ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *