తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే…?

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే…?

ఈ ఏడాదిలో డిసెంబర్ దే ఆఖరు నెల. దీంతో తెలుగు రాష్ట్రాలల్లో ఉన్న ఆయా బ్యాంకులకు సెలవులు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 5న ఆదివారం సందర్భంగా సెలవు. డిసెంబర్ 11న రెండో శనివారం, డిసెంబర్ 12న ఆదివారం రావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబర్ నెల 19న ఆదివారం కావడంతో సెలవు. డిసెంబర్ 25న క్రిస్మస్, నాలుగో శనివారం కలిపి వచ్చాయి. మరుసటి రోజు డిసెంబర్ 26న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు బ్యాంకులు తెరుచుకోవు. కావున తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 6 రోజులు తెరుచుకోవు.

కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌లో బ్యాంకులకు 6 రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి.బ్యాంకులకు సెలవులు ఉన్న రోజు ఖాతాదారులు నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకుల సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు.

బ్యాంకులకు ప్రతీ నెలలో ఎన్ని సెలవులు ఉంటాయో, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయో వివరాలు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే ఆయా రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంక్ పండుగల సెలవుల వివరాలు తెలుసుకోవడానికి హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *