త్వరలో దేశీయ మార్కెట్ లోకి Honda U Go Electric Scooter..?

త్వరలో దేశీయ మార్కెట్ లోకి Honda U Go Electric Scooter..?
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో రోజురోజుకి పోటీ పెరిగిపోతుంది. అయితే కంపెనీల మధ్య పోటీ పెరగడంతో వినియోగదారులు ఏ బైకులను కొనుక్కోవాలన్న కన్ఫ్యూజన్ అవుతున్నప్పటికీ.. మార్కెట్లో ఏదీ మంచి బైకు, ఏ బైకు ఫీచర్స్ ఎలా ఉన్నాయి అని ఆలోచించి మరికొనుకుంటున్నారు బైక్ లవర్స్.. సో ఈ బైకు గురించి తెలుసుకుందామా మరీ..
అయితే ఈ మధ్యనే పెరోందిన రెండు కంపెనీలు తమ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే వినియోగదారుడికి ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ల పట్ల అవగాహన అనేది ఇప్పడిప్పుడే అర్థమవుతోంది. సో.. ఇంకా కొత్త ఫీచర్లతో పాటుగా ధర కోసం కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. వినియోగదారుడి నాడిని కనుక్కొని కొన్ని కంపెనీలు కూడా తమ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి సిద్దం అవుతున్నాయి.అయితే వాహన, కార్ల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న హోండా కంపెనీ.. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్స్ త్వరలో దేశంలోకి తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీని ధర కూడా అతి కూడా అతి తక్కువ ధరలో వినియోగదారుడికి అందిస్తారని సమాచారం.
అయితే ఈ మధ్యనే హోండా కంపెనీ చైనాలో CN-Y 7499(సుమారు ఇండియన్ రూ.86,000) ధరకు హోండా యు-గో స్కూటర్ ను కొత్తగా లాంచ్ చేసింది. అయితే దీనిని కూడా మన దేశంలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైకు 1.8 kw గరిష్ట అవుట్ పుట్ గల 1.2 kw మోటార్ సహాయంతో పనిచేస్తుంది. U-go టాప్ స్పీడ్ గంటకు 53 కిలోమీటర్లు. అయితే ఈ స్కూటర్ ని ఒకసారి చార్జ్ చేస్తే 65 కి.మీ. వేగం వెళ్లనున్నట్లు హోండా కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మన దేశంలో వాహన దారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల పై మొగ్గు చూపడంతో ఈ ఎలక్ట్రికల్ బైకులకు అకస్మాత్తుగా డిమాండ్ పెరుగుతోంది. ఈ స్కూటర్ మన దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే U-go ప్రారంభించడం గురించి హోండా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. హోండా యు-గోను ధర ప్రస్తుతం మార్కెట్ వ్యాల్యు ధర రూ.86,000 కంటే తక్కువ ధరకు తీసుకోని వస్తే మిగతా బైకులతో పోలిస్తే హోండా కంపెనీ బైకు మార్కెట్లో నిలబడే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా.. బైకు లవర్స్ కూడా ఎక్కువగా కొనే అవకాశం లేకపోలేదు… సో.. ఈ బైకు కోసం ఎదురుచూడాల్సిందే గురూ..