పాయే… ఇంకోటి పోయే…! దుబ్బాక తర్వాత TRS కు రెండో ఓటమి !!

TRS కు ఉపఎన్నికల్లో ఎదురు లేదు…
దళిత బంధు కలిసొస్తుంది
ఫించన్ దారులు, రైతుల ఓట్లు మాకే
కారుకు తిరుగులేదు
గ్యాస్ బండలు బీజేపీని ఓడిస్తాయి…

ఇది మొన్నటి దాకా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు పలికిన పలుకులు. తెలంగాణలో తమకు తిరుగులేదని అనుకున్నారు. దుబ్బాక ఓడిన తర్వాత కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో మార్పు రాలేదు.

ఇంకా అదే ధీమా… అదే గాంభీర్యం… రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు తీయాల్సిన ఆయుధాలైన దళిత బంధు లాంటివి ముందే తీయాల్సిన వచ్చినా… హుజూరాబాద్ గెలుస్తామన్న ధీమా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల్లో బాగా కనిపించింది. 60 వేలు… 70 వేల కొలువులు ఇస్తామంటూ… 11 నెలలుగా ఊరిస్తూ… నిరుద్యోగుల ఉసురు పోసుకున్నందుకు హుజూరాబాద్ జనం TRS ను తిప్పి కొట్టారు. ఈటలకే పట్టం కట్టారు. ఒకప్పుడు మాస్ నేతగా హరీష్ రావుకి ఎంతో కొంత మంచి పేరు ఉండేది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో హరీష్ ప్రచారం… తన స్థాయిని దిగజార్చిందని విశ్లేషకులు ఆనాడే చెప్పారు.

గ్యాస్ బండల రేట్లతో బీజేపీని దెబ్బకొడదామనుకున్నారు. ఈటలను వ్యక్తిగతంగా దెబ్బతీసేలా విమర్శలు చేశారు. ఈటలను ఉన్నట్టుండి పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా…TRS నాయకులకు మాత్రం తెలియలేదు. నిరుద్యోగులు, యువత, హామీలతో మోసపోయిన వర్గాలు… అధికార పార్టీపై ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో హుజూరాబాద్ ఫలితం బయటపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *