జబర్ధస్త్ హైపర్ ఆదికి… భారీగా ముడుతోంది !
జబర్దస్త్ లో కమెడియన్ హైపర్ ఆది లేనిది ఎపిసోడులు ఉండవు.. హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..తెలుగు రాష్ట్రాల్లో హైపర్ అంటే తెలియని వారు ఉండరు.. చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్దలు దాగా హైపర్ పంచ్ ల కోసం ఎదురు చూస్తుంటారు. అంతలా తన కామెడీ, టైమింగ్ పంచులతో తెగ నవ్విస్తుంటాడు. హైపర్ చేసే కామెడీ స్కిట్లు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తాయి. తనదైన కామెడీ టైమింగులతో అలరించే హైపర్ ఆదికి బుల్లితెరపై మాంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుందని టాక్. ఈవెంట్‌ను బట్టి హైపర్ హైపర్ ఆది పారితోషికం డిమాండ్ చేస్తాడని సమాచారం. జబర్దస్త్ పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీలలో కనపడుతుంటారు.
కామెడీ స్క్రిప్ట్ తో ఆయన చేసే ప్రతి ఒక్క స్కిట్‌కి గానూ లక్షల్లో అందుకుంటాడని తెలుస్తోంది. ఆ సంపాదనతో పోల్చుకుంటే ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జబర్దస్త్ తో ఫేమ్ అయిన హైపర్ ఆదికి సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. దీంతో పాటు ఆయన వాణిజ్య ప్రకటనల వైపు కూడా ఓ కన్నేశారని సమాచారం. జబర్ధస్ కామెడీ షోలతో నాలుగు రాళ్లు.. కాదండి.. 40 రాళ్లు పైగా వేసుకున్నారని తెలుస్తుంది. సొంత ఊర్లో ఇప్పటికే సుమారు 16 ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం.