త్వరలో… హ్యుందాయ్ హైడ్రోజన్ వేవ్ కారు

త్వరలో… హ్యుందాయ్ హైడ్రోజన్ వేవ్ కారు
సెప్టెంబరు 7న వర్చువల్ సమావేశంలో ప్రైజ్ వెల్లడి
కార్ల తయారీ సంస్థలో హ్యుందాయ్ కంపెనీ ఒకటి. ఇది న్యూ టెక్నాలజీతో మరో సంచలనానికి అడుగులేయబోతుంది. కొరియర్ కార్ల తయారీ కంపెనీ హైడ్రోజన్‌తో నడిచే హ్యుందాయ్ కారును ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టనుందని సమాచారం. అయితే ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే..
ఇండియా మార్కెట్లోకి హైడ్రోజన్‌తో నడిచే కారు వస్తే మాత్రం హ్యూందాయ్ ఫస్ట్ కంపెనీగా ముందంజలో ఉందనడంలో సందేహాం లేదు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న కంపెనీలన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజీపై దృష్టి పెట్టాయి.. ఈ విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటున్నాయి. అయితే దీనికి భిన్నంగా హ్యుందాయ్ కంపెనీ మాత్రం హెడ్రోజన్ కారు మార్కెట్ లోకి తేవాలని చూస్తోంది. అయితే హ్యుందాయ్ కంపెనీ వినియోగదారుల దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. అయితే ఇండియా రోడ్డు మార్గాలలో ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇప్పుడిప్పుడే టెక్నాలజీతో ఇండియాలోకి కార్లు వస్తున్నాయి..ఇది ఇండియాకు ఒక వరముగానే భావించాలని కార్ల లవర్స్ అంటున్నారు.
హ్రైడోజన్ వేవ్ పేరుతో కాన్సెప్ట్ కారుని సిద్ధం చేసింది. ఈ కంపెనీకి ఓ పెనుసవాలుగా మారినా.. దీనిపై మార్కెట్లో ఏ రెస్పాన్స్ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. అయితే ఈ కారుకు సంబంధించిన విశేషాలను సెప్టెంబరు 7న వర్చువల్ సమావేశంలో వెల్లడిస్తారట. ఆ తర్వాత చైనాలోని కొరియాలోని గొయాంగ్లో హ్యుందాయ్ వెల్లడించనుంది. ఇండియాలో ఎంత ప్రైజ్ ఉంటుందో కంపెనీ అదే రోజు చెబుతుందని సమాచారం.