అదిరిపోయే లుక్ తో హ్యుందాయ్ i20

అదిరిపోయే లుక్ తో హ్యుందాయ్ i20

అదిరిపోయే లుక్ తో హ్యుందాయ్ i20 కారు

వాహన తయారీ సంస్థల్లో హ్యుందాయ్ మోటారు సంస్థ ఒకటి..అయితే కొత్త టెక్నాలజీతో కొత్త హంగులతో ఇండియాలో తాజాగా స్పోర్టీ లుక్‌తో i20 En-line కారును ప్రవేశపెట్టింది. ఎన్‌-లైన్‌ శ్రేణిలో యువ కస్టమర్లను ఆకట్టుకునేందు కొత్త హంగులతో కారును తీసుకొచ్చింది హ్యుందాయ్ మోటార్ సంస్థ. ఈ కంపెనీలో తొలి మోడల్‌ కారుగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ శ్రేణి మోడళ్ల కార్లను అమెరికా, యూరప్, దక్షిణ కొరియా, రష్యా వంటి అగ్రదేశాల్లో ఈ కంపెనీ కార్లను విక్రయిస్తోంది. అయితే స్పోర్టీ లుక్‌ కోసం కారు బయట, లోపలా పలు మార్పులు చేసింది కంపెనీ.

కారు యొక్క స్పెషల్స్ ఏంటంటే: 1 లీటర్‌ పెట్రోల్‌ టర్బో జీడీఐ ఇంజిన్‌, 6 స్పీడ్‌ ఇంటెలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ తో పాటుగా  7 స్పీడ్‌ డీసీటీ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టింది కంపెన. అయితే 120 ps పవర్, 4 డిస్క్‌ బ్రేక్స్, 50కిపైగా కనెక్టివిటీ ఫీచర్స్,  Sun Roof, 6 Airbags for Car లో  ఏర్పాటు చేశారు. 10 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సన్‌రూఫ్‌ కోరుకునే కస్టమర్ల సంఖ్య 2018లో 13 శాతముంటే ప్రస్తుతం 30 శాతానికి చేరిందని హ్యుందాయ్ మోటారు సంస్థ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *