ICC T20 World Cup 2021 షెడ్యూల్ విడుదల

ICC T20 World Cup 2021 షెడ్యూల్ విడుదల

ICC T20 World Cup 2021 షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ పురుషుల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ఐసీసీ విడుదల చేసింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌లో జరగనున్నట్లు తెలిపారు.

ఇండియాలో జరగాల్సిన మ్యాచ్…కరోనా కారణంతో క్రికెట్ వేదిక మారిన సంగతి గతంలో తెలిసిందే. ఈ టోర్నీ అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉండటం అభిమానుల్లో ఉత్సాహం నింపినప్పటికీ..ఈ రెండు జట్లు తలపడేది ఎప్పుడా? అని ఆశక్తిగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అక్టోబరు 23 నుంచి టోర్నీ ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజే భారత్ టోర్నీ మొదలవుతుంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో అంటే కొంత ఆసక్తి చోటుచేసుకుంటుంది.

అయితే దుబాయ్ వేదికగా అక్టోబరు 24న మ్యాచ్ జరగనుంది. సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అక్టోబరు 31న న్యూజిల్యాండ్‌తో, నవంబరు 3న ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ మ్యాచులు ఆడుతుంది. నవంబర్‌ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్‌ 14వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుందని ప్రకటించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: