T20 వరల్డ్ కప్‌లో బోణి కొట్టిన భారత్
T-20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 66 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మెగా ఈవెంట్ లో తొలి బోణీ నమోదు చేసిన భారత జట్టు. అటు ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైన భారత్.. కోలోక ముందే.. న్యూజీలాండ్ చేతిలో కూడా వరుస పరాజయం పాలై క్రికెట్ అభిమానుల చేత విమర్శలు మూటకట్టుకున్న కోహ్లీసేనా.. ఈ మ్యాచ్ లో తన సత్తా చాటింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్ అవకాశాలు లేని వేళ అఫ్ఘన్ జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచి అభిమానులను ఆకట్టుకుంది.
కాగా, టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఆటలో తమ ప్రతిభనంతా ఆడి చూపించారు టీమిండియా ఆటగాళ్లు.. ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ 69 పగులు, రోహిత్ శర్మ 74 పరుగులతో చెలరేగారు. రిషబ్ పంత్ 27, హార్ధిక్ పాండ్యా 35 రాణించి అజేయంగా నిలిచి మన ఇండియా సత్తా చాటారు. కాగా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది టీమిండియా జట్టు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన అఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేధించలేకపోయింది. 144 పరుగులకు చేతులెత్తేసింది. 20 ఓవర్లు ఆడిన అఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.