దేశంలో టాప్​100 విద్యా సంస్థలను ప్రకటించిన కేంద్రం

దేశంలో టాప్​100 విద్యా సంస్థలను ప్రకటించిన కేంద్రం

దేశంలో టాప్​100 విద్యా సంస్థలను ప్రకటించిన కేంద్రం

వరుసగా మూడోసారి ఐఐటీ- మద్రాస్​ టాప్​ ప్లేస్​

దేశంలో టాప్​ 100 విద్యా సంస్థలకు కేంద్ర విద్యాశాఖ ర్యాంకింగ్స్​ ప్రకటించింది. 2021 ఏడాదిగాను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ (NIRF)నివేదికను వర్చువల్​ విధానంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం   6 అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఈ నివేదిక ద్వారా ర్యాంకులు ప్రకటించారు కేంద్రమంత్రి.

తొలి ర్యాంక్ ఐఐటీ మద్రాస్ (IIT MADRAS) 

దేశ వ్యాప్తంగా కేటగిరీలో తొలి ర్యాంక్ (IIT MADRAS) సాధించింది.ఇంజినీరింగ్​ విభాగంలోనూ ఐఐటీ మద్రాస్ టాప్​ ప్లేస్ ఉంది. అయితే వరుసగా మూడోసారి ఈ ఘనతను ఐఐటీ మద్రాస్​ సొంతం చేసుకుంది.

రెండో స్థానంలో బెంగళూరు IISC

ఈ ర్యాంకింగ్స్​లో​ (IISC)బెంగళూరు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

మూడో స్థానంలో బాంబే

మూడో స్థానంలో ఐఐటీ-(IIT BOMBAY)బాంబే నిలబెట్టుకుంది. ఈ మూడు దేశంలోని మొదటి మూడు అత్యున్నత విద్యాసంస్థలుగా నిలిచాయి.

ఆ తర్వాతి తొలి పది స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్​, ఐఐటీ ఖరగ్​పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువాహటి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU), బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU)లు విద్యాసంస్థలున్నాయి.

తొలి పది స్థానాల్లో లేని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ( JNU) లేకపోగా…  కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు టాప్​ 10లో చోటు దక్కించుకున్నాయి. అవి జామియా మిలియా ఇస్లామియా (JMI), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వంటి యూనివర్శిటీలు.. అయితే గతేడాది JMI 10వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకుంది. అయితే ఇసారి హైదరాబాద్​లోని (HCU) హెచ్​సీయూ మాత్రం 6 నుంచి 9వ స్థానానికి పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *