మీ ఇంట్లో వాడే ఇంగువతో ఎన్నో లాభాలు…?

ఇంగువ వల్ల ఎన్నో లాభాలున్నాయి…?
మన భారతీయ వంటకాలలో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఇంగువ లేదని మన వంటకాలు మొదలు పెట్టరు. సాధారణంగా ఇంగువను పప్పు, సాంబారు, పులిహోరల్లో ఇంగువను కలుపుతారు. ఇంగువ టేస్టే వేరు..ఇంగువ లేకపోతే రుచి ఉండదు. ఇంగువ ఘాటువాసనతో కలిగి దీనిలో ఔషధ గుణాలు బోలెడున్నాయి. ఆహారంలో చిటికెడు ఇంగువ వాడడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం పెరుగుతుంది. అదెలాగంటే…
ఇంగువ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఈ ఇంగువతో ఉదర సంబంధ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇంగువ కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తుంది. రోజూ కొద్దిగా ఇంగువను పప్పు లేదా గ్రేవీలో వేసుకుంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు గ్లాసెడు నీళ్లలో చిటికెడు ఇంగువ పొడి కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా, బ్రాంకైటిస్, పొడి దగ్గు వంటి శ్వాసపరమైన ఇబ్బందులను తొలగిస్తాయి. ఇంగువలో అల్లంపొడి, తేనె కలిపి తాగినా ఉపశమనం లభిస్తుంది.
హిమో గ్లోబిన్ శాతం పెంచడంతో పాటు, రక్తపీడనాన్ని తగ్గించడంలో ఇంగువ తోడ్పడుతుంది. ఇంగువలో కౌమరిన్ రక్త ప్రవాహన్ని మెరుగుపరుచుతుంది. నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటే ఒక కప్పు మజ్జిగలో కొద్దిగా ఇంగువ, మెంతుల పొడి, చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఎంతటి నొప్పైనా మాయం అవుతుంది. బాగా తల నొప్పితో బాధ పడేవారు వేడి నీళ్లలో ఇంగువ వేసుకొని రోజులో 2 లేక 3 సార్లు తాగితే తలనొప్పి తగ్గిపోతుంది.
అల్లం, ఇంగువ పేస్ట్ మిశ్రమాన్ని కీటకాలు కుట్టడం వల్ల ఏర్పడిన దద్దుర్ల మీద రాస్తే అవి మాయమవుతాయి. ఈ ఇంగువ యాంటీడోట్‌గా కూడా పనిచేస్తుంది.
మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలను పోగొట్టి ముఖాన్ని అందంగా మార్చుతాయి. ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్, ఇంగువ మిశ్రమం మొటిమల్ని తగ్గిస్తుంది. ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉన్నాయి
కేశ సౌందర్యం పెంచుకునేందుకు కూడా ఇంగువ పనికొస్తుంది. యోగర్ట్, బాదం నూనె, ఇంగువ పేస్ట్ తలకు పట్టించి తల ఆరిన తరువాత వేడి నీళ్లతో శుభ్రం చేసుకుంటే కురులు తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.
ఇంగువ లేని వంట వ్యర్థం. ఈ ఇంగువలో కాల్షియం, ఫాస్పరస్ తో పాటుగా కెరటిన్, బీ విటమిన్ అధికంగా ఉంటుంది.
పంటి నొప్పితో భాధ పడేవారు ఇంగువని నిమ్మరసంతో కలిపి దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి ఉపశమనం ఎంతగానో లభిస్తుంది. ఇంగువను నల్లమందు విరుగుడుగా కూడా వాడతారు. నల్ల మందు యొక్క చెడుగుణాల నుంచి కాపాడడంలో ఇంగువకి ప్రత్యేక పాత్ర ఎంతో ఉంది. అందుకే మన భారతీయులు ఇంగువ వాడడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.