ఇంటర్ ఎగ్జామ్ పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
ఇంటర్ ఎగ్జామ్ పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు
కరోనా కారణంగా ఇంటర్ ప్రమోట్ అయిన విద్యార్థులకు మళ్లీ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ నిర్వహిచొద్దంటూ పరీక్షలను రద్దు చేయాలని..హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రుల సంఘం. అయితే ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా..? అని….హైకోర్టు పిటిషన్ దారులను సదరు హైకోర్టు ప్రశ్నించింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని విద్యాశాఖకు తెలిపింది.
మరోవైపు ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని హైకోర్టు సదరు పిటిషనర్ కు తెలిపింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పిటిషన్ ఉపసంహరించుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తల్లిదండ్రుల సంఘం పిటిషన్ ఉపసంహరించుకుంది. కాగా ఈనెల 25 నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 4.58 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.