iPhone కొనే వారికి శుభవార్త.. 14న కొత్త మోడల్ రిలీజ్!

iPhone కొనే వారికి శుభవార్త.. 14న కొత్త మోడల్ రిలీజ్!
మీరు కొత్త ఐ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఈనెల 14 నుంచి iPhone 13 మోడల్ విడుదల చేస్తున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తెలిపింది. దీనిలో భాగంగా 4 కొత్త iPhone మోడళ్లు ఇలా ఉన్నాయి.అవి iPhone 13, iPhone13 మినీ, iPhone 13 Pro, iPhone ప్రో మ్యాక్ లను సదరు సంస్థ విడుదల చేస్తుందని సమాచారం. Apple వాచీ సిరీస్ 7, కొత్త Apple ఎయిర్ పాడ్స్ 3 వంటి ఉపకరణాలను సైతం విడుదల చేయొచ్చుని టెక్ నిపుణులు అంచనా. ప్రపంచ వ్యాప్తంగా iPhone 13 విడుదల చేసిన తరువాతనే.. ఇండియాలో iPhone 13 ధరలను ప్రకటించే అవకాశం ఉందని.. అక్టోబర్ నెలలో iPhone విక్రయాలను ప్రకటించే అవకాశం ఉందని టెక్ నిపుణులు తెలిపారు.