75 ఏళ్లు దాటిన వారు ఐటీ రిటర్న్ అవసరం లేదు 

 75 ఏళ్లు దాటిన వారు ఐటీ రిటర్న్ అవసరం లేదు 

 75 ఏళ్లు దాటిన వారు ఐటీ రిటర్న్ అవసరం లేదు 

2021 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది

75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు, ఐటీ రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు పొందేందుకు కొంత ఊరట లభించింది. దీనికి సంబంధించిన వాంగ్మూల పత్రాలను ఐటీ విభాగం వెరిఫై చేసింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలు కానుంది. 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు పింఛను ఆదాయం, Fixed డిపాజిట్లపై వడ్డీ ఒకే బ్యాంకు నుంచి పొందుతుంటే అట్టి వయో వృద్దులు ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన పనిలేదని తెలిపారు. 2021 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ నియమ నిబంధనలను కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) తాజాగా జారీ చేసింది. అయితే డిక్లరేషన్‌ ఫామ్‌లను కూడా ఇవాల్సిందిగా తెలిపింది. వయో వృద్ధులకు గల సంబంధిత బ్యాంకుల్లో సమర్పిస్తే పన్ను కోతను (CBDT) ఆ బ్యాంకులు నిలిపివేస్తాయని తెలిపింది. అయితే పింఛను డిపాజిట్‌ అయ్యే బ్యాంకులోనే వడ్డీ ఆదాయం కూడా ఉంటేనే ఐటీఆర్‌ ఫైలింగ్‌ నుంచి మినహాయింపు లభిస్తుందని ఐటీ విభాగం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *