వంటింట్లో దొరికే ఈ కాయతో అధ్భుతాలు ఎన్నో..

వంటింట్లో దొరికే ఈ కాయతో అధ్భుతాలు ఎన్నో..

వంటింట్లో దొరికే ఈ కాయతో అధ్భుతాలు ఎన్నో..

మన దేశంలో ఎక్కువగా నాటు వైద్యం, ఆయుర్వేదానికి ప్రాముఖ్యతనిస్తారు మన పూర్వీకులు. అయితే మనకు అందుబాటులో ఉన్న జాజికాయ గురించి తెలుసుకుందాం. జాజికాయలను భారతీయులు పురాతన కాలం నుంచి పలు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ జాజికాయ రుచి, వాసన కలిగి ఉంటుంది. జాజికాయ, జాజి ఆకులు, జాజి పువ్వులు కూడా మన జీవిన విధానంలో ఎంతగానో ఉపయోగపడతాయి. జాజికాయ వాడడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాలైన లాభాలు ఉన్నాయని, ఆయుర్వేదంలో చెప్పబడింది. జాజికాయ ఎంతో మంచిదని వైద్యులు, ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ జాజికాయ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా మరీ..

మానసిక ఒత్తిడి, ఆందోళన దూరం చేయడంలో జాజికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుతో పాటుగా శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. జాజికాయ పొడిలో కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

విరేచనాలు: ఈ జాజికాయ పొడిని సూప్‌లలో వేసి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. జాజికాయను మెత్తగా రుబ్బి పొడి చేసుకోవాలి. ప్రతిరోజు పావు టీ స్పూను చొప్పున రోజు మలబద్దకం, గ్యాస్‌ తదితర జీర్ణసమస్యలు తగ్గుతాయి.

నోటి దుర్వాసన:  నోటిపూతతో బాధపడే వారు రోజు జాజికాయ ఆకులు తింటే సరి, జాజికాయ ఆకులను తరచూ నమిలి మింగడం వల్ల నోటి అల్సర్లు తగ్గిపోతాయి. జాజి ఆకుల రసాన్ని కషాయము చేసుకొని పుక్కిలించడం వల్ల నోటి సంబంధిత వ్యాధులు దరిచేరవు.

తల నొప్పి: తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ జాజి కాయ మంచి ఔషదంగా పని చేస్తుంది.

చెవిపోటు: జాజి ఆకుల రసంలో కొద్దిగా నువ్వుల నూనె  వేసి, నీరు ఇమిడేదాకా మరిగించాలి. అలా మరిగించిన నూనెను చెవి పోటు ఉన్నప్పుడు చెవిలో రెండు చుక్కలు వేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

కిడ్నీ: లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

నొప్పులు: ఈ జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

నిద్ర: నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది.

సౌందర్యం: జాజిపువ్వులను మెత్తగా నూరి.. ముఖానికి పట్టించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా మొటిమలు, నల్లటి మచ్చలు, ముడతలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

కాళ్ల పగుళ్లు: జాజి ఆకుల రసాన్ని తరచూ పగిలిన కాళ్ళకు పట్టించడం ద్వారా త్వరగా పగుళ్లు నయం అవ్వడంతో పాటు కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

సెక్స్ సమస్యలు: జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకొని గాజుపాత్రంలో పెట్టండి. రోజు 5 గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి.. రోజు సేవిస్తే సంతాన లేమి సమస్య తొలగి పోతుంది. మరియు పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.  స్త్రీలకు రుతుక్రమ సమయంలో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది.

చికెన్ ఫాక్స్: ఈ వ్యాధి ఉన్న వారు జాజికాయ, శొంఠి పొడుల్ని ఆహారానికి ముందు పావు టీ స్పూన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *