రాష్ట్రంలో సర్పంచులు, జడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు
రాష్ట్రంలో సర్పంచులు, జడ్పీటీసీల గౌరవ వేతనం పెంపు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ కిందకు వచ్చే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం 30 శాతం పెంచాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. గతంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం రూ.5వేలు ఉండగా… తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రూ.6500 పెరిగింది. అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీల గౌరవ వేతనం రూ.10వేలు నుంచి రూ.13వేలకు పెరిగింది.