తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..2 రోజుల వరకే ఛాన్స్
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వైద్య సిబ్బంది (Health Staff)భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ విధంగా అప్లై చేసుకోండి.
పోస్టు: స్టాఫ్ నర్సు, ఖాళీలు: 6, విద్యార్హత : బీఎస్సీ నర్సింగ్, జీతం: రూ.23వేలుగా నిర్ణయించారు.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
రిజర్వేషన్: SC, STలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అనుభవం: అభ్యర్థులు యాక్టీవ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
- అప్లికేషన్(Application Form)ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫామ్ కు సెల్ఫ్ అటెస్ట్ చేసిన Updated Resume, విద్యార్హత ధ్రువపత్రాలు. ఆక్టీవ్ నర్సిగ్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ జతచేయాలి. - అప్లికేషన్ ఫామ్ పై సూచించిన చోట వారిచ్చిన సైజ్ లో ఫోటోను అంటించాలి. ఫోటో మీదుగా గెజిటెడ్ అధికారిచే సంతకం చేయాలి.
- ఓసీ, బీసీ అభ్యర్థులు అభ్యర్థులు అయితే DMHO పేరిట రూ. 200 డిమాండ్ డ్రాఫ్ట్ ను తీసి అప్లికేషన్ ఫామ్ కు జత చేయాలి
- జత చేయాల్సిన ఇతర ధ్రువపత్రాల జిరాక్సులపై అటెస్ట్ సైన్ చేయించాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ ఫామ్ ను ఈ నెల 28వ తేదీలోగా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, నియర్ పిల్లర్ నంబర్ 294, శివరాంపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, పిన్ కోడ్ 500052 చిరునామాకు పంపించాలి.