కాబుల్ లో వరుస పేలుళ్లు, 103 మందిపైగా మృతి..పెరుగుతున్న మృతులు

కాబుల్ లో వరుస పేలుళ్లు, 103 మందిపైగా మృతి..పెరుగుతున్న మృతులు

కాబుల్ లో వరుస పేలుళ్లు, 103 మందిపైగా మృతి..పెరుగుతున్న మృతులు

పెరుగుతున్న మృతుల సంఖ్య

ఐఈడీతో పాటుగా.. ఆత్మాహుతి దాడి

ఘటనలో 103 మందికి పైగా మృతి

బాంబుదాడిలో తాలిబన్లు, చిన్నారులు, మహిళలు

14 మంది పైగా  అమెరికా సైనికులు

200 మందికి తీవ్ర గాయాలు..మృతుల మరింత పెరిగే అవకాశం

మేమే పేల్చామని ప్రకటించిన ఐసిస్

పాశ్చాత్య వర్గాలు హెచ్చరించిన గంటల్లోనే ఘటన

పేలుళ్లను ఖండించిన తాలిబాన్‌ అధికార ప్రతినిధి

అఫ్గానిస్తాన్ నుంచి ఇప్పటికి లక్ష మందికి పైగా.. 

తరలించామని తెలిపిన అమెరికా.. ఐరోపాకు మరో 7 వేల మంది పైగా..

తాలిబాన్ల ఆక్రమించిన  అఫ్గానిస్తాన్‌ గురువారం రక్తమోడింది. అఫ్గానిస్తాన్ వదిలి వెళ్లేందుకు కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర గుమిగూడిన విదేశీయులే, ఆఫ్గానిస్తాన్ ప్రజల లక్ష్యంగా ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌)దాడులకు తెగబడ్డారు. అక్కడ మారణహోమం సృష్టించారు.. అయిదే వాళ్లు నిర్ధేశించుకున్న మానవబాంబు దాడి, బాంబుదాడుల్లో మహిళలు, చిన్నారులు మృతి చెందారు. ఉగ్రదాడుల్లో అమెరికాకు చెందిన 11 మంది సైనికులు, ఒక వైద్యుడు, అమెరికా మిలటరీ దళానికి చెందిన మరో ఇద్దరు సహా 103 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పెంటగాన్, అఫ్గానిస్తాన్ వర్గాలు చెబుతున్నాయి. బాంబు దాడుల్లో మరో 180మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో అమెరికా భద్రత దళాలకు చెందిన ఇతర విదేశీయులు, దేశీయులతో సహా పలువురు సైనికులు ఉన్నారని తెలిపారు. గాయపడ్డ వారంతా ప్రస్తుతం కాబూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. అమెరికా సైనికులను ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ఎమరెన్జీగా తరలించామని అమెరికా అధికారి పేర్కొన్నారు.

ఆఫ్గానిస్తాన్ ప్రజలు తమ దేశాన్ని తాలిబాన్లు వశం చేసుకుంటే మమ్మల్ని బ్రతకనివ్వరని.. చెబుతూనే ఉన్నారు.. వాల్ల పాలనలో మేము చాలా హింసలకు గురువుతామని చెబుతూనే ఉన్నారు.. దీని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్న నెపథ్యంలో అక్కడ ఘటనలు జరగడం చాలా దుశ్యర్యగా భావించొచ్చు. అఫ్గానిస్తాన్‌కు ఐసిస్‌ టెర్రరిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, కాబూల్‌ ఎయిర్ పోర్టు లక్ష్యంగా చేసుకుని మానవ, కారు బాంబులతో విరుచుకుపడే ప్రమాదముందంటూ ప్రపంచ దేశాల నిఘావర్గాలు హెచ్చరిస్తూనే వస్తున్నాయి.. అయితే హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఎయిర్ పోర్టు, దాని పరిసర ప్రాంతాల్లో ఆఫ్గానిస్తాన్, దేశీ,  విదేశీయులే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తో పాటుగా ఐరోపాలోని అమెరికా మిలటరీ చీఫ్‌ టోడ్‌ వాల్టర్స్‌తో పాటుగా అగ్రదేశ నాయకులు హెచ్చరించిన సంగతి తేలిసిందే..

ఆఫ్గానిస్తాన్ లో విదేశీయుల ఎంబసీల దగ్గర కూడా బాంబుదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వేరే మార్గాల ద్వారా అఫ్గానిస్తాన్‌ నుంచి బయటపడే అవకాశాలను పరిశీలించాలని అమెరికా, బ్రిటన్‌ సహా ఇతర దేశాల నాయకులు తమ పౌరులకు సూచించింది. గురువారం సాయంత్రం 5.11 సమయంలో ఎయిర్ పోర్టు అబే గేటు వద్ద ఒక మానవబాంబుతో దాడి చేశారు. ఎయిర్ పోర్టు వెనక భాగంలో పెద్ద శబ్ధంతో బాంబు పేలుడంతో ఒక్కసారిగా.. పరిగెత్తుకుంటూ పెద్ద అరుపులు, కేకలతో పరుగులు తీస్తున్న జనం.. ఓ ప్రక్క రక్తపు ముద్దలు, క్షతగాత్రుల ఆర్తనాదాలలతో పెద్ద అరుపులు వచ్చాయని.. ఆ వెంటనే ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో కాల్పుల శబ్దం వినిపించిందని ఓ పౌరుడు తెలిపారు.

బాంబు దాడులను ఖండించిన దేశాలు

ఈ దాడులు తమ పనే అని ఐసిస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ బాంబు పేలుళ్ల ఘటనపై తీవ్రంగా ఐక్యరాజ్య సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తో సహా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ టెర్రరిస్టుల దాడులను ఖండించారు. భారత విదేశాంగ శాఖ కూడా ఐసిస్‌ టెర్రరిస్టు దాడులను తీవ్రంగా ఖండించింది. దాడుల నేపథ్యంలో అఫ్గానిస్తాన్ గగనతలంలో 25 వేల అడుగలకు తక్కు ఎత్తులో విమానాలను నడపొద్దంటూ బ్రిటన్‌ తన వాయుసేనకు ఆదేశాలు జారీ చేసింది.

ఎయిర్ పోర్టులో సిక్కులను అడ్డుకున్న తాలిబన్లు

ఆఫ్గానిస్తాన్ లో ఉండే సిక్కులు.. ఢిల్లీలో జరగనున్న సిక్కు గురువు తేఘ్‌ బహదూర్‌ 400వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నసిక్కులను అడ్డుకున్నారని ఢిల్లీలోని సిక్కు మతపెద్దలు చెప్పారు. అయితే వీరందరినీ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో అడ్డుకున్నారని.. బాంబు దాడి ఘటనలో తమ వారు కూడా చనిపోయి ఉండొచ్చని తెలిపారు.

సురక్షితంగా ఇండియన్లు కాపాడతామన్న విదేశాంగ మంత్రి 

అఫ్గానిస్తాన్‌లో ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. అఫ్గానిస్తాన్ లో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి. అఫ్గానిస్తాన్లో పరిస్థితులు చక్కబడే వరకు.. తాలిబన్లతో కేంద్రం ఒక నిర్ణయానికి రాలేదని జైశంకర్ అన్నారు. ఆఫ్గానిస్తాన్ నుంచి భారతీయులందరినీ సురక్షితంగా తరలించడమే..మా ముందున్న పెద్ద లక్ష్యం అని.. అఫ్గానిస్తాన్తో స్నేహసంబంధాలను మున్ముముందు కొనసాగించడమూ అనేది తరువాతి అంశం అని కేంద్ర మంత్రి జై శంకర్‌ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *