కాబూల్ ఎయిర్‌పోర్టులో మరో పేలుడు..!

కాబూల్ ఎయిర్‌పోర్టులో మరో పేలుడు..!
ఆఫ్గానిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తరువాత అక్కడ నరమేథం కొనసాగుతోంది. అయితే వరుసగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నది. ఈ వరుస ఘటనలతో అక్కడి దేశీయులు, విదేశీయులు దేశం విడిచే పారిపోయిందేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత గురువారం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు దగ్గర జంట పేలుళ్లు జరిగాయి. అయితే ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోకముందే.. తాజాగా మరో పేలుడు హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లక్ష్యంగానే జరిగినట్లు ఆఫ్గానిస్తాన్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, పేలుడులో ఎవరైనా మృతి చెందారా.. లేక గాయాలపాలయ్యారా.. అనే వివరాలు తెలియాల్సి ఉంది.
కాబూల్‌లో 24 గంటల నుంచి 36 గంటల వ్యవధిలో టెర్రరిస్టులు మళ్లీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించిన నేపథ్యంలో పేలుడు సంభవించడం గమనార్హం. కాబూల్ ఎయిర్‌పోర్టులో స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అమెరికన్లే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు పాల్పడిటనట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుడుపై ఇంకా ఏ ఉగ్రవాది సంస్థ వెల్లడించలేదు. మా సైనికుల్ని చంపిన ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడమే లక్ష్యమని గత వారం జోబోడైన్ ప్రకటన చేశారు.
Missile strike on a house near Kabul Airport, nature of the strike unclear pic.twitter.com/wFdhCkHSwn
— ELINT News (@ELINTNews) August 29, 2021