ఈ పండు తింటే ఎన్నో ప్రయోజనాలు..

ఈ పండు తింటే ఎన్నో ప్రయోజనాలు..

ప్రకృతి మనకు సీజనల్ కు తగ్గట్టుగా ఎన్నో రకాలా పండ్లను మనకు అందిస్తుంటుంది. సాధారణంగా పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ ఏదో ఒక పండును తినటం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి. అయితే అన్ని కాలాల్లోనూ అన్ని రకాల పండ్లు మనకు దొరకవు..కాబట్టి మనం కాలాలకు అనుగుణంగా ఆ సీజన్లో దొరికే పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం. వీటిలో ఉండే పోషక విలువలు మన శరీరానికి అందడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా మరీ..

మనకు ఈ సీజన్ లో కమలాపండుతో పాటుగా సీతాఫలం కూడా లభిస్తుంది. అయితే చాలా మంది కమాలపండు తినేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలోనే కమలా పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

కమలా పండుని మనం తొక్కతీసి తింటాం.. పైగా అబ్బబ్బ పులుపు అని అంటుంటాం కదండి..! కానీ దీనికి భిన్నంగా తొక్క తీయకుండా తినేవాళ్ళు కూడా ఉన్నారండోయి. నేపాల్ కు వెళ్ళినపుడు కమలాలు తొక్కలు వొలిచి తింటే వింతగా చూసే ప్రమాదం కూడా లేకపోలేదండోయో.. ఎందుకంటే అక్కడి వారు తొక్కతో సహా తింటారు.

స్విట్జర్లాండ్ వాసులు ఈ పండ్లపై మీగడ, పంచదార అద్దుకొని మరీ మరీ ఇష్టంగా తింటారు. చైనీయులు దీన్ని “చైనీస్ యాపిల్ “అని, డచ్ వాళ్ళైతే “సినాస్ యాపిల్”అని ముద్దుగా పిలుచుకుంటారని చరిత్రలో రాసి ఉంది.

 • ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలతో బాధపడేవారు కమలాపండును తీసుకుంటే చాలా మంచిది. నిత్యం కమలాలు తినే వారిలో మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడవు.
 • జలుబుతో బాధపడే పిల్లలకు ఈ పండును తినిపిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జలుబు దరిచేరదు.
 • గర్భస్థ శిశువు, మెదడు ఆరోగ్యంగా చురుక్కగా ఉండేందుకు ఈ పండు ఎంతగానో మేలు చేస్తుంది.
 • కమలాపండు తినడం వల్ల గుండె జబ్బుల అదుపులో పెట్టుకోవచ్చు. దీనిలో ఫొలెట్, పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల జబ్బుల బారినుంచి ఉపశమనం కలుగుతుంది.
 • కమలాపండును సాఫ్ట్ డ్రింకులు, ఐస్ క్రీంలు, బేకరీ ఫుడ్స్ లలో వాడతారు. కొన్నిచోట్ల ఈ నారింజని కీళ్ళ నొప్పులకి ఔషదంగా కూడా వాడతారట.
 • బరువు తగ్గాలనుకునే వారు కమలాపుండును రోజు తీసుకుంటే మంచిది. ఈ పండులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది.
 • కమలా పుండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రీయ సమస్యలు లేకుండా చేస్తుంది. అధిక చక్కెర వ్యాధి సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక కమలా పండును తినడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కాగా ఈ పండు తింటే మనం తీసుకున్న ఆహారం కూడా తేలికగా జీర్ణం అవుతుంది.
 • కమలా పండులో విటమిన్ C, ఫాస్ఫరస్, బీటా కెరోటిన్, ఆల్కహాల్స్ వంటివి ఉంటాయి. ఈ పండులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. దీంతో ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
 • ఈ కమలాపండును తినడం వల్ల బిపిని కూడా అదుపులో ఉంచుతుంది. కేవలం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. నిత్యం కమలా పండును తినడం వల్ల చర్మంపై ఏర్పడే ముడతలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా, యవ్వనంగా కనబడుతుంది.
 • కమలాపండు తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని ఫేస్ ప్యాక్ లా తయారుచేసుకోవచ్చును. ముఖం పైన పేరుకు పోయిన దుమ్ము, ధూళి కణాలు తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
 • సిట్రస్‌ జాతి పండ్లు తినేవారికి క్యాన్సర్ ముప్పు 40 నుంచి 45శాతం వరకు తగ్గినట్లు పరిశోధనలో తేలింది.
  విటమిన్‌-సి శరీరంలో ఉంటే బ్యాక్టీరియా, వైరస్‌లు దరిచేరవు.
  కమలా పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
 • కమలాలు చిన్నపిల్లల నుంచి పెద్దలు వరకు ప్రతీ ఒక్కరు తినొచ్చు.. కానీ రోజుకీ 3 కమలాలని మించి తినకూడదట. ఒక్కటైతే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
 • ఈ పండును భోజనానికి ముందు కానీ, ఖాళీ కడుపుతో కానీ కమలాను అస్సలు తీసుకోకూడదట. ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. దీంతో గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఉన్నవారు ఇబ్బందులకు గురికావొచ్చు.
 • కమాల పండును.. పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదట. కనీసం గంట వ్యవధి ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీంతో వాంతులు, విరోచనాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *