వచ్చే ఏడాది 28న యాదాద్రి ఆలయ పున:ప్రారంభం

వచ్చే ఏడాది 28న యాదాద్రి ఆలయ పున:ప్రారంభం

తెలంగాణలో మిని తిరుమలగా పేరు గాంచినది యాదాద్రి ఆలయం..ఈ ఆలయ పునః ప్రారంభం ఎప్పుడు ఎప్పుడా అని భక్తులంతా ఎదురుచూస్తున్నారు.ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..యాదాద్రి ఆలయ పున: మహూర్తం తేదీని ప్రకటించారు. 2022, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు..మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం ఈవో ద్వారా పంపుతామని వెల్లడించారు. సరిగ్గా మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు. స్వయంబుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం చూస్తుంటూ ఆనందగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

యాదాద్రి ఆలయాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్..ఈ ఆలయ పున: ప్రారంభ తేదీని చినజీయర్ స్వామి ముహూర్తం ఖరారు చేశారని తెలిపారు. సమైక్యాంధ్రలో ఒకప్పుడు తెలంగాణలోని ఆధ్మాత్మికత రంగంలో నిర్లక్ష్యానికి గురయ్యామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రలో తెలంగాణలో ఉన్న జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా ప్రాచుర్యం కల్పించలేదు. ఈ ఆలయానికి మా కుటుంబంతో 50ఏళ్ల క్రితం వచ్చామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పుష్కరాలపై మాట్లాడుతూ గోదావరి, కృష్ణా, ప్రాణహిత పుష్కరాల నిర్వహణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఘనంగా పుష్కరాలను నిర్వహించామని కేసీఆర్ తెలిపారు.

ఒకప్పుడు యాదాద్రిలో మంచి నీళ్లకు కూడా లేని పరిస్థితి. యాదాద్రిని ఈరోజు కాళేశ్వరంతో బస్వాపురం ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి జరిగింది. బస్వాపురం ప్రాజెక్టు (నృసింహ సాగర్‌) తెలంగాణలో రెండో ప్రాజెక్టు నిర్మాణం యాదాద్రిలో కొనసాగుతుంది. దీని ద్వారా గోదావరి జలాలు స్వామివారి పాదాలను తాకనున్నాయని అని సీఎం వెల్లడించారు..

ఒకప్పడు యాదాద్రికి వస్తే ఉండేందుకు స్థలం లేదని యాత్రికులు, ప్రసిద్ధ వ్యక్తులు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ స్థితి ఉండదు. ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి వీవీఐపీలకు( VVIP)లకు ముఖ్యమైన సూట్ నిర్మాణాలు, సామాన్యులు ఉండేందుకు కూడా కాటేజీల నిర్మాణం చేపట్టబోతున్నాం. ప్రస్తుతం 250 కాటేజీల నిర్మాణం చేస్తున్నామని.. యాదాద్రి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ రూపుదిద్దుకోబుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

అయితే యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితమే బీజం వేశాం. మహోన్నతమైన ఆలయాల్లో ప్రముఖమైన ఆలయంగా రూపుదిద్దుకోబోతుంది యాదాద్రి. ఈ ఆలయ వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం జీయర్ స్వామి ఆధ్వర్యంలో చేపట్టాం.

చినజీయర్ స్వామి ఆదేశాను సారంగా యాదాద్రి ఆలయ పునర్‌ ప్రారంభానికి మహా కుంభ సంప్రోక్షణం చేపట్టబోతున్నాం.. దీంతో పాటుగా మహా సుదర్శన యాగం చేయబోతున్నాం. ఆలయ నిర్మాణం, ప్రారంభం ఆగమ శాస్త్రం ప్రకారం చేయాల్సి ఉంటుంది. స్వామివారి విమాన గోపురాన్ని స్వర్ణ తాపడం చేయించబోతున్నాం. ఆలయ పున: నిర్మాణంలో ఏదైనా పొరపాటులు జరిగితే చినజీయర్ స్వామి వారు క్షమించి తన దైవ కార్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్నామని కేసీఆర్ తెలిపారు.

యాదాద్రి విమాన గోపురాన్ని తయారు చేసేందుకు 125 కిలోల బంగారం అవసరం అవుతుందని..మా ఫ్యామిలి నుంచి ఒక కిలో పదహారు తులాల బంగారు అందిస్తామని తెలిపారు. దీంతో పాటుగా మెడ్చల్ నియోజక వర్గం నుండి కేజీ బంగారం, తరువాత మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు కూడా తమ వంతుగా బంగారాన్ని అందిస్తారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు,3,069 మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు ఉన్నాయిని తెలిపారు. దీనిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేస్తామని తెలిపారు.  ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇస్తే ఆర్బీఐ నుంచి బంగారం కొంటాం అన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *