బిజినెస్ రంగంలోనికి నటి కీర్తి సరేష్

బిజినెస్ రంగంలోనికి నటి కీర్తి సరేష్

బిజినెస్ రంగంలోనికి నటి కీర్తి సరేష్

తెలుగు, తమిళ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్‌.. తాజాగా ఇప్పుడు   వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. తన స్నేహితురాళ్లు కాంతిదత్‌, శిల్పారెడ్డి తో కలిసి “భూమిత్ర బ్రాండ్‌” పేరుతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. సహాజ సిద్ధమైన ఔషధాలను తయారు చేస్తున్నామని.. అయితే ఈ ప్రొడక్ట్స్ ప్రస్తుతం సౌందర్యాన్ని మెరుగుపరిచే విధంగా స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని నటి కీర్తి సురేష్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో అన్ని కెమికల్స్ ప్రొడక్ట్స్ తయారువుతున్నాయని… మేము దానికి భిన్నంగా ప్రకృతి సిద్ధమైన ప్రొడక్ట్స్ తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నామని తెలియజేశారు. ప్రస్తుతం చెన్నైలో మా ఉత్పత్తులను తయారు చేస్తున్నామని… విడతల వారీగా అన్ని చోట్ల విస్తరిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *