సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్ట్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి నారాయణ్ రాణే అరెస్ట్
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను చెంప దెబ్బ కొట్టేవాడినని చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే (Narayan Rane) అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణ్ రాణే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టు, రత్నగిరి కోర్టులకు వెళ్లారు. అయితే నారాయణ్ రాణే కు రెండు చోట్లా బెయిల్ ను తిరస్కరించాయి కోర్టులు.
అయితే మహారాష్ట్రలో జన ఆశీర్వాద్ యాత్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. స్వాత్రంత్యం దినోత్సవం నాడు సీఎం ఉద్ధవ్ ఈ ఏడాది ఎన్నో ఇండిపెండెన్స్ డే జరుపుకొంటున్నామో అని.. గుర్తు లేక వెనక ఉన్న వాళ్లను సీఎం ఉద్ధవ్ థాక్రే అడగడం సిగ్గు చేటు. అయితే నేను ఆ ప్రదేశంలో నేను ఉంటే..ఉద్ధవ్ థాక్రే చెంప పగలగొట్టేవాడిని” అని కేంద్రమంత్రి రాణే అన్నారు. అనుచిత వ్యాఖ్యలలు చేసిన రాణేపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై స్పందించిన నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే మంగళవారం ఉదయం కేంద్రమంత్రి రాణేను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆర్డర్ తో పోలీసులు రాణేను రత్నగిరి జిల్లా చిప్లున్లో అదుపులోకి తీసుకొన్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం రత్నగిరి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కోర్టులో పిటిషన్ ను తిరస్కరించారు. మరోసారి బెయిల్ కోసం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాణే