కేరళలో విస్తరిస్తున్న కరోనా.. రెండో రోజు 30వేలకుపైగా కేసులు

కేరళలో విస్తరిస్తున్న కరోనా.. రెండో రోజు 30వేలకుపైగా కేసులు

కేరళలో విస్తరిస్తున్న కరోనా.. రెండో రోజు 30వేలకుపైగా కేసులు

కేరళలో విస్తరిస్తున్న కరోనా.. కరోనా వైరస్ వ్యాప్తి భయంకరంగా రోజురోజుకి పెరిగిపోతోంది. మొన్నటి వరకు 20వేల లోపు ఉన్న రోజువారీ కేసులు.. సడెన్ గా ఓనం పండగ తర్వాత భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా 30వేల పైగా కేసులు నమోదుఅవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల్లో.. ఒక్క కేరళలోనే ఓనం పండుగ తర్వాత కరోనా ఉద్ధృతి బాగా పెరిగింది. కేరళలో మూడో రోజు 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 18,997 మంది కోలుకున్నారు. కరోనాతో 162 మంది మృతవాత పడ్డారు. కేరళలో కోవిడ్ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 18.04గా ఉంది. అంటే పరీక్షలు చేసిన ప్రతి 100 మందిలో 18 మందికి కోవిడ్ నిర్ధారణ అవుతోందని నివేదికలు చెబుతున్నాయి. కరోనా రికవరీల కంటే కొవిడ్ కొత్త కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా నమోదువుతున్న కేసులలో సగం కొవిడ్ కేసులు కేరళలోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 1,81,310 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

మూడో దశ వ్యాప్తిస్తుందున్న వార్తల నేపథ్యంలో కరోనా కేరళను ఉపేస్తోంది. ఇప్పటికే 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో వైరస్ వ్యాప్తిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి పరిస్థితి పై ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్రం సంప్రదింపులు చేస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో కరోనా మరింత ఉధృతం అయ్యే అవకాశాలున్నాయని.. దేశ వ్యాప్తంగా రాబోయే పండుగలను కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ జరుపుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *