కేరళలో భారీ వర్షాలు, 26కి చేరిన మృతులు

కేరళలో భారీ వర్షాలు, 26 కి చేరిన మృతుల సంఖ్య

కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం బీభత్సం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా తాజాగా 26మంది మృతి చెందారు. అయితే శుక్రవారం నుంచి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగి పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మృత్యువాత పడుతున్నారు.

మృతి చెందిన వారిలో 17 మంది కొట్టాయంకు చెందిన వారు కాగా, 9 మంది ఇడుక్కి జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని..దీంతో పాటుగా మరికొంత మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, మళ్లా భారీ వర్షం కురిస్తే మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని కొట్టాయం జిల్లా కలెక్టర్‌ పీకే జయశ్రీ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని.. సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పినరయ్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ

ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురియడంతో మృతి చెందిన వారి పట్ల ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదలు, కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *