వచ్చే ఏడాదే కేజీఎఫ్ -2

వచ్చే ఏడాదే కేజీఎఫ్ -2

కేజీఎఫ్ -2 విడుదల వచ్చే ఏడాదే మరీ..

కరోనా సెకండ్ వేవ్ తో ‘కె.జి.ఎఫ్ ఛాప్టర్‌ 2’ వాయిదా పడింది.  అయితే తొలుతగా కె.జి.ఎఫ్ ఛాప్టర్-2 జులై 16న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. 2022 ఏప్రిల్‌ 14 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానునన్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.

డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్ లో పాన్‌ ఇండియా స్టార్ యశ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రం. హీరో యశ్ తో హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై విజయ్‌ కిరంగదూర్‌  నిర్మిస్తనున్న సంగతి తెలిసిందే. ఈ చింత్రంలో  సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తుస్తున్నారని చిత్రయూనిట్ తెలిపింది. గతంలో వచ్చిన ‘కె.జి.ఎఫ్ ఛాప్టర్‌ 1’ పలు భాషల్లో రికార్డులు అందుకొన్న సంగతి తెలిసిందే

అయితే ‘కె.జి.ఎఫ్ ఛాప్టర్‌ 2’ ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నామని చిత్రయూనిట్ తెలిపింది.  అయితే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో ‘ఛాప్టర్ 1’ అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *