ఒక్క స్పూన్ దీన్ని తీసుకోండి.. కిడ్నీల్లోని రాళ్లు మాయం..!

ఒక్క స్పూన్ దీన్ని తీసుకోండి.. కిడ్నీల్లోని రాళ్లు మాయం..!

ఒక్క స్పూన్ తీసుకోండి.. కిడ్నీల్లోని రాళ్లు క‌రిగిపోతాయి..!

కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య‌తో ప్ర‌స్తుతం చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నీళ్ల‌ను త‌క్కువ‌గా తాగ‌డంతోపాటు వంశ‌పారంప‌ర్యంగా కూడా ఇవి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అయితే కిడ్నీ స్టోన్ల‌ను క‌రిగించ‌డంలో కొండ పిండి ఆకు అద్బుతంగా ప‌నిచేస్తుంది.

మూత్ర పిండాల్లో ఎందుకు రాళ్లు వస్తాయి: ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు క్యాల్షియం టాబ్లేట్ టాబ్లేట్ లను విపరీతంగా వాడుతున్నారు. దీని వల్ల క్యాల్షియం ఆక్సలేట్ గా మారి రాళ్లు ఏర్పడతాయి. మనిషి శరీరంలో క్యాల్షియం ఫాస్పేట్, అక్సలైట్ రసాయనాలు పేరుకుని పోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లుగా మారతాయి. అందువల్లే రాళ్లు అనేవి ఏర్పడతాయి. ఈ ప్రక్రియను ఆయుర్వేద భాషలో మూత్రసరి అని అంటారు. ఈ కొండపిండాకు పొడిని త‌యారు చేసుకొని గాజుసీసాలో భద్రపర్చుకొని రోజు ఉద‌యం సాయంత్రం తీసుకుంటే అద్భుతమైన ఫ‌లితం వస్తుంది.

రోగి లక్షణాలు: మూత్ర పిండాళ్లలో రాళ్లు ఏర్పడటం వల్ల విపరీతమైన మూత్ర నాళ్లాల్లో నొప్పి, అప్పుడప్పుడు జ్వరంతో పాటుగా వాంతులు, ఆకలి మందగించడం, నిద్రపట్టపోవడం, మూత్రం పోసే సమయంలో మంట వంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి.

ఈ కొండపిండాకు మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, ఎక్క‌డైనా సుల‌భంగా ల‌భిస్తుంది. గ‌డ్డి బాగా పెరిగే చోట ఇది కూడా పెరుగుతుంది. ఇది పొలాలు, చేన్ల‌లో ఎక్కువ‌గా పెరుగుతుంది. కొండ పిండాకు మరో పేరు పాషాణ‌బేది అని లేదా తెలగ పిండి ఆకు, పిండి కూర అని కూడా పిలుస్తారు.

కొండా పిండాకు పొడి తయారీ విధానం: కొండ పిండాకు మొక్క‌ను వేర్ల‌తో స‌హా తెచ్చి శుభ్రంగా క‌డిగి నీడ‌లో ఎండ‌బెట్టాలి. త‌రువాత దాన్ని పొడి చేయాలి. ఆ పొడిని ప‌లుచ‌ని వ‌స్త్రంలో ఆ పొడిని వేసి జ‌ల్లించిన‌ట్లు చేయాలి. దీంతో కింద ఇంకా స‌న్న‌ని పొడి ప‌డుతుంది. దాన్ని సేక‌రించి గాజు సీసా లేక అందుబాటులో ఉన్న సీసాలో నిల్వ చేయాలి.

మేము చెప్పిన విధంగా తయారు చేసుకున్న కొండ పిండాకు పొడిని రోజూ ఉద‌యం, సాయంత్రం ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటితో తీసుకోవాలి. లేదా నేరుగా కొండపిండాకు ఉదయం పరిగడపున తీసుకోవచ్చు. భోజ‌నం చేసిన అనంత‌రం గంట‌కు తీసుకోవ‌చ్చు.

మీకు కొద్దిగా చేదుగా ఉంటుంది. మీకు తినలేని పరిస్థితి ఉంటే కొద్దిగా తేనే కలుపుకొని తింటే మంచిది. రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు త్రాగితే మంచిది. షుగర్ ఉన్నవాళ్లు డాక్టర్ సలహా పాటించి మందును తీసుకొండి. ఇలా 40 రోజుల పాటు చేస్తే క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంది.

పత్యం ఎలా చేయాలి:  కొండ పిండాకు తీసుకునే వారు, కిడ్నీలో రాళ్లు ఉన్న వారు పాలకూర, సోయాబీన్, టమోటా, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఉప్పు మితంగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు.

అయితే మీకు స్కానింగ్ టెస్టులో రిజల్టును బట్టి మందును వాడాల్సి ఉంటుంది. కొంతమందికి చాలా చిన్న సైజులో రాళ్లు ఉంటాయి. మరికొంత మందికి రాళ్లు పెద్దవిగా ఉంటాయి. అప్పుడు మాత్రం మీ కిడ్నీల్లో రాళ్ల సైజ్ పెద్ద‌గా ఉన్న‌వారు ఇంకో 40 రోజుల పాటు అద‌నంగా ఈ కొండపిండాకు పొడిని వాడాల్సిందే. దీంతో మీరాసించిన ఫలితం  త‌ప్ప‌క ఫ‌లితం లభిస్తుంది. మేం చెప్పేది డాక్టర్ గారి సూచనలతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *