త్వరలో Kinetic Luna Electric Moped

త్వరలో Kinetic Luna Electric Moped

త్వరలో Kinetic Luna Electric Moped   

త్వరలో ఎలక్ట్రిక్ రిక్షాలు మరియు ఎలక్ట్రిక్ సైకిళ్లు

ప్రయోగాలు చేయడంలో కైనెటిక్ ఎలక్ట్రిక్ మోపెడ్ సంస్థ ఒకటి. అయితే  సరికొత్త తరహాలో ఆల్-ఎలక్ట్రిక్ మోపెడ్‌తో లూనా బ్రాండ్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సంస్థ  కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ 1 kW మోటార్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా శక్తినివ్వగలదని ఈ కంపెనీ తెలిపింది. ఈ మోపెడ్ గరిష్టంగా 25 కి.మీ/గం వేగం కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 70-80 కి.మీ.వరకు వెళ్తుంతుందని..మోపెడ్ యొక్క స్టైలింగ్ అసలు లూనా నుండే మిగతా కంపెనీలకు ప్రేరణ పొందాయని ఓ నివేదికలో కంపెనీ తెలియజేసింది.

ఆల్-ఎలక్ట్రిక్ మోపెడ్‌తో లూనాలో ఫ్యూచర్లు ఇలా ఉన్నాయి:  ఈ ఆల్-ఎలక్ట్రిక్ మోపెడ్‌ లూనా తంబ్ (Thumb) స్టార్టర్‌తో పాటు గా USB ఛార్జింగ్ మరియు LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ తో పాటుగా ఇతర ఫీచర్లను ప్రవేశపెట్టింది. కైనెటిక్ గ్రీన్ ఈ నివేదికలను ధృవీకరించనప్పటికీ మార్కెట్లో రావడానికి టైం పడుతుందని కినెటిక్ గ్రీన్ సీఈఓ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వానీ తెలియజేశారు. ఈ వైకిల్ తో పాటుగా.. ఎలక్ట్రిక్ రిక్షాలు మరియు ఎలక్ట్రిక్ సైకిళ్లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వానీ ఓ ప్రకటనలో పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *