కియా ఎలక్ట్రికల్ కారు వచ్చేసింది

కియా ఎలక్ట్రికల్ కారు వచ్చేసింది

కియా ఎలక్ట్రికల్ కారు వచ్చేసింది

అదిరిపోయే ఆఫర్లు,  భలే ఫ్యూచర్లు 

నేటి ప్రపంచంలో మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి. మోడల్, ఇంజెన్ స్పీడ్ ఎంత, కారు తయారు అయిన తేదీ, ట్యాంక్ కెపాసిటి, ఇంటియర్ డిజైనర్, సెన్సార్ తో సహా అన్ని ఎంక్వైరీ చేసీ మరీ కొంటారు, మైలేజ్ ఎంతో వస్తోందని పలు ప్రశ్నవ వర్షం కురిపిస్తూ కారుకొనే ప్రియులు షోరూములలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ల బుర్రలు తిని పారేస్తుంటారు. కానీ పెట్రోల్, డిజిల్ స్థాయి నుంచి ఎలక్ట్రికల్ కారు టెక్నాలజీకి ఎదిగేలా మానవ మేదస్సు కృషి చేసింది. అయితే కొత్త మోడల్, కొత్త ఫ్యూచర్ తో కియా కారు వచ్చేసిందండోయే ఓ లుక్కుద్దేమా మరీ.

ప్రపంచంలోనే కార్ల తయారీలో దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ రెండో స్థానంలో ఉంది. అయితే ఈ సంస్థ  కొత్త టెక్నాలజీని పరిచేయడంలో ఈ సంస్థ తనదైన శైలీలో తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరిచింది. ఆల్ ఎలక్ట్రిక్ EV-6 సెడాన్ గా పేరున్న ఈ ఎలక్ట్రిక్ కారును కొరియాలో 40,800 డాలర్ల నుంచి 49,500 డాలర్లకు తీసుకొని వచ్చింది

మన ఇండియాలో మార్కెట్లో కియా EV-6 కోసం 30,000కు పైగా ప్రీ ఆర్డర్లను, యూరప్, అమెరికా సహా పలు దేశాల్లో 8,800 ప్రీఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలోపు దక్షిణ కొరియాలో 3,000 యూనిట్లను, విదేశీ మార్కెట్లలో 17,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి  ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొనిరానున్నట్లు కీయా కంపెనీ తెలిపింది.

ప్రభుత్వ సబ్సిడీలతో కలిపి (34,761 డాలర్ల( అంటే ఇండియన్ రూపాయలలో రూ.25 లక్షల) కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు అని తెలిపింది.

E-6  మోడల్  రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తోంది.

స్టాండర్డ్ 58 కిలో వాట్ అవర్, KWH బ్యాటరీ ప్యాక్ తో కారును తయారు చేశారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్లు వెళ్తోందని కంపెనీ యాజమాన్యం తెలిపింది.

77-4,KWH లాంగ్ రేంజ్.. మోడల్ గల కారు బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 475 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని యాజమాన్యం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *