KTM 250 అడ్వెంచర్ బైక్ పై రూ.25వేలు తగ్గింపు

KTM 250 అడ్వెంచర్ బైక్ పై రూ.25వేలు తగ్గింపు
ప్రముఖ బజాజ్ ఆటో మోబైల్ సంస్థ బైకులు తయారుచేయడంలో ఈ సంస్థ పేరు తెచ్చుకుంది. బైకు ప్రియులను ఆకట్టుకునేందుకు KTM 250 అడ్వెంచర్ బైక్ పై రూ.25,000 తగ్గింపు ఇస్తోంది.
ఈ అవకాశం ఆగస్టు 31 వరకు ఈ మోడల్‌ను రూ.2.3 లక్షలకే విక్రయిస్తామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (ప్రొబైకింగ్) సుమీత్ నారంగ్ వెల్లడించారు. ఈ బైక్‌లు 248 CC లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 30 పీఎస్ పవర్, 24 ఎన్ఎం టార్క్‌తో రూపొందాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13.5లీటర్స్, సీట్ హైట్ 823mm గా ఉన్నాయి. 2012లో దేశీయ మార్కెట్ లోకి KTM 250 అడుగుపెట్టింది.