ఈ నూనెతో మొటిమలు తగ్గించుకోండి..

ఈ నూనెతో మొటిమలు తగ్గించుకోండి..

ఈ నూనెతో మొటిమలు తగ్గించుకోండి..

అందం అంటే అందరికీ పిచ్చి, ఆ పిచ్చితోనే అందరూ ఎన్నో రకాల ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. కొందరు మసాజులు చేస్తుంటారు. మరికొందరూ ఆయిల్స్, పేస్టులు వాడి అందాన్ని మెరుగుపరుచుకునేందుకు తెగ ట్రై చేస్తుంటారు. అయితే ప్రతి మనిషి ఆయిల్ ఫుడ్ తో పాటు అనేక రకాల పదార్థాలను తింటుంటారు. దీన్ని బట్టి కూడా అందంలో తేడా వస్తుంటుంది. అయితే ప్రతి మనిషి యవ్వన దశలో మొటిమలు రావడం సహజం. అయితే కొంత మందికి ఇరవై నుంచి మూప్పై సంవత్సరాలలోపు మొటిమలు వస్తుంటాయి. వాటిని వ్రేళ్లతో చిదిమేయడం మంచిది కాదు..అవి ఇంకా ఎక్కువై ముఖం నిండా అవుతాయి. మొటిమలు రావడానికి అనేక కారణాలున్నాయి..ముఖ్యంగా మానసిన ఒత్తిడి, హార్మన్లలో ప్రభావం, స్టిరాయిడ్లు(మత్తు మందులు)వంటివి వాడటంతో మొటిమలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటుగా, ఆయిల్ ఫుడ్స్ తక్కువగా తినాలి. అయితే ప్రతి రోజు మొహన్ని సబ్బుతో రోజులో రెండు మూడు సార్లు చల్లనీ నీరుతో కడుక్కోవాలి. దీనితో పాటుగా మొత్తని వస్త్రం తీసుకొని తుడుచుకోకుండా వదిలిస్తే.. గాలికి ఆరిపోతుంది. అయితే ఎన్ని ఫెషియల్స్ చేసుకున్నా మొటిమలు తగ్గడం లేదు.

అయితే కొన్ని నూనెలతో మొటిమలన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వాటిలో ఇదొక ఆయిల్ టీట్రీ ఆయిల్.. ఇది అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే ఆయిల్ గా చెప్పొచ్చు. దీని డైరెక్ట్ గా వాడకుండా కొబ్బరినూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ తో కలిపి వాడాలి. దీని ద్వారా మొటిమల నివారణ నుంచి ముఖాన్ని సంరిక్షించుకోవచ్చు.

అయితే సాధారణంగా పెసర పిండి, శనగ పిండితో కూడా ఆయిల్స్ మిక్సి చేసి వాడుతుంటారు. అయితే ఈ ఆయిల్ ను మాత్రం పెసరపిండిలో కాస్త రోజ్ వాటర్, మరియు రెండు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి ముఖానికి రాసి మొత్తటి స్క్రబ్బర్ తో రాసిదాని కాసేపు ఆరనివ్వాలి. తరువాత మొఖాన్ని నాజుగా చల్లటి నీటితో కడగాలి. అయితే మన శరీర భాగాల్లో కూడా అక్కడక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.

సాధారణంగా గోళ్లు, చేతులు కాళ్ల సందుల్లో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వాటిని నివారించేందుకు కొబ్బరినూనెలో రెండు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి రాస్తే తగ్గిపోతాయి. చుండ్రు పేలు సమస్యతో బాధ పడుతుంటే టీట్రీ ఆయిల్, ఆలివ్, కొబ్బరిలో వేసి రెండు గంటల తరువాత తల స్నానం చేస్తే చండ్రు, తలలో పేలు వంటి సమస్యలు పోతాయి. యవ్వనంలో ఉన్న ఆడువారిలో ఈస్ట్రోజన్, మగవారిలో టెస్టోస్టిరాన్ అనేవి ఉంటాయి. దీని లోపం వల్లే శరీరంలో మొటిమలు అనేవి ఏర్పడతాయి. శరీరంలో సుబేసియస్ గ్రంథుల నుండి సెబమ్ ఎక్కువగా తయారడం వల్లే మొటిమలకు దారి తీస్తుంది. సో.. టీట్రీ ఆయిల్ వాడండి.. ఈ ఆయిల్ తో మీ మొహాన్ని అందంగా కాపాడుకోండని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆయిల్ ఖరీదు ఎక్కువే.. అయితే ఈ ఆయిల్ ఆయుర్వేదిక్ స్టోర్స్, ఆన్ లైన్ షాషింగ్ మాల్స్ లో వివిధ రకాల బాటిల్లలో లభ్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *