ల్యాప్ టాప్ వాడే వాళ్ళకి గుడ్ న్యూస్

- ల్యాప్ టాప్ వాడే ప్రియులకు గుడ్ న్యూస్
- వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా.. అయితే మీకోసమే ఈ ల్యాప్టాప్స్
కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో చైనా దిట్ట.. దానిలో భాగంగానే ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేస్తుంటుంది. దీనిలో భాగంగానే చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ రెండు అద్భుతమైన ల్యాప్‌టాప్‌లను ఈ ఇండియాలో లాంచ్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ గానే భావించొచ్చు. ల్యాప్ టాప్ ల్లో ఎన్ని మోడల్స్ వచ్చిన వినియోగదారులు కొత్త ఫ్యూచర్ల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే సరికొత్త మోడల్స్ ను లాంచ్ చేసింది “ రెడ్మీ బుక్ ప్రొ ”, “ రెడ్‌మిబుక్ ఈ-లెర్నింగ్” పేరుతో తీసుకొచ్చింది ఈ సంస్థ. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 10గంటల పాటు వాడుకోవచ్చునని రెడ్ మీ తెలిపింది. ఈ రెండింటిలోనూ లెవెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఉపయోగించారు. అయితే వీటిలోని ఫ్యూచర్లను ఒకసారి చూసి లుకేద్దామా
రెడ్ మీ బుక్ ఫీచర్స్ : రెడ్‌మిబుక్ ప్రొ 8జీబీ ర్యామ్+512 జీబీ స్టోరేజీ కాన్ఫికిరేషన్ ధర రూ. 49,999 మాత్రమే.
రెడ్‌మిబుక్ ఈ-లెర్నింగ్ ఫీచర్స్ : 8జీబీ+256 జీబీ కాన్ఫికిరేషన్ ధర రూ. 41,999 కాగా, 8జీబీ ర్యామ్+512 జీబీ ఆప్షన్ ధర రూ. 44,999 మాత్రమే.
విండోస్ 10 హోమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ ఎడిషన్ 2019లను ముందస్తుగానే రెడ్ మీ సంస్థ లోడ్ చేసింది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు విండోస్ 11కు ఉచితంగా అప్‌గ్రేడ్ అవుతాయి. అలాగే, కంపారిటిబుల్ డివైజ్‌ల మధ్య ఫైల్స్‌ను సులభంగా షేర్ చేసుకునేందుకు MI స్మార్ట్ షేర్ యాప్‌ను కూడా వీటిలో ఇన్స్టాల్ చేసింది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, మై హోం స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి.