LIC IPOలో పాలసీదారులకు 10శాతం రిజర్వేషన్ ! అందుకోసం ఏం చేయాలంటే ….
ప్రభుత్వం రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ( IPO) మార్చి నెలలో వస్తోంది. ఇష్యూ సైజ్ 5 లక్ష కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే LIC IPOకి అప్లయ్ చేసే LIC పాలసీదారులకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. LIC IPO లో పాలసీదారులకు 5 శాతం దాకా డిస్కౌంట్ అందించే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. సెబీకి త్వరలో సమర్పించే ముసాయిదా పేపర్స్ లో ఈ వివరాలు ఉంటాయి. వీటిని ఈనెల 10న SEBI కి LIC సమర్పిస్తోంది.
LIC ఎంబెడెడ్ విలువ 5 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంటున్నారు. మార్కెట్ విలువ అంతకంటే ఎక్కువే ఉంటుంది. LIC IPOలో పాలసీదారులకు 10 శాతం వాటాలను కేటాయించనున్నారు. డిస్కౌంట్ కూడా ఇచ్చే ప్రతిపాదన ఉంది.
LIC షేర్లు కావాలంటే పాలసీదారులు ఇది గమనించాలి
LIC IPOలో ఇన్వెస్ట్ చేసేందుకు LIC పాలసీహోల్డర్లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయాలని LIC కోరుతోంది. దీనిపై ఇప్పటికే అన్ని తెలుగు దినపత్రికల్లో వివరంగా ప్రకటనలు కూడా జారీ చేసింది. LIC పాలసీహోల్డర్లు IPOలో ఇన్వెస్ట్ చేయాలంటే Dmat Account ఓపెన్ చేయాలి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి తప్పనిసరిగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి.
LIC పాలసీదారులు తమ పాన్ కార్డ్ వివరాలను LIC ఇండియా పోర్టల్‌లో ఆన్లైన్లోనే అప్డేట్ చేయొచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్లో పాన్ నెంబర్, పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి వివరాలు అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో పాన్ నెంబర్ అప్డేట్ చేయలేకపోతున్నవారు ఏజెంట్‌ను సంప్రదించాలి.
ఆన్లైన్లో LIC పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయడానికి ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు https://licindia.in/వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Online Services సెక్షన్లో Online PAN Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. జెండర్ సెలెక్ట్ చేయాలి. ఇమెయిల్ ఐడీ, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డుపై ఉన్నట్టుగా పూర్తి పేరును అందులో ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఇచ్చి Get OTP పైన క్లిక్ చేస్తే…రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది
వివరాలన్నీ సరిచూసుకొని ఓటీపీ ఎంటర్ చేయాలి. LIC పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. LIC పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయితే… త్వరలో రాబోయే LIC IPOలో అప్లయ్ చేయాలనుకుంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి,. LIC IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకునేముందు కంపెనీ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
[ays_poll id=3]