ఆ దేశంలో మళ్లీ లాక్ డౌన్.. పెరుగుతున్న కేసులు  

ఆ దేశంలో మళ్లీ లాక్ డౌన్.. పెరుగుతున్న కేసులు  

ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ .. దీనికి భిన్నంగా మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై పంజా విప్పుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అగ్రరాజ్యలైన రష్యా, జర్మనీ వంటి దేశాలలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా నుంచి కోలుకునే లోపులోనే.. తాజాగా యూరప్‌లోని ఆస్ట్రియా దేశంలో రోజుకు 15వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే సోమవారం (నవంబర్ 22) నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ఆస్ట్రియా ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్న కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆస్ట్రియా ఛాన్సిలర్ అలెగ్జాండర్ షాలెన్ బర్గ్ వెల్లడించారు.

అందుకే 10 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్ పెడుతున్నామని వెల్లడించారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడితినే లాక్‌డౌన్‌ పొడిగించాలా లేదా అన్న విషయంపై ఆలోచిస్తామమని ఆస్ట్రియా ఛాన్సిలర్ అలెగ్జాండర్ బర్గ్ తెలిపారు.

అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే భారీగా జారిమానాలు తప్పవని హెచ్చరించారు. అటు యూరప్ ఖండంలో అతి తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదైన దేశాల్లో ఆస్ట్రియా ఒకటి. కరోనా టీకాలు వేసుకోవాలని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయామని ఆ దేశ అధికారులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: