పెళ్లైన వారికి లవ్ లెటర్ ఇస్తే నేరమే: బాంబే హైకోర్టు

పెళ్లైన మహిళకు లవ్ లెటర్ రాస్తే అది కచ్చితంగా నేరమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళకు తన క్యారెక్టరే విలువైన ఆభరణంగా అని కోర్టు తెలిపింది. ప్రేమ పేరుతో పెళ్లైన మహిళకు లెటర్ పంపటమంటే ఆమెను అవమానించినట్లేనని తెలిపింది. వివాహితకు లవ్ లెటర్ రాసిన వ్యక్తికి బాంబే హైకోర్టు లోని నాగ్ పూర్ ధర్మాసనం రూ.90 వేల రూపాయల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళితే 2011 లో నాగ్ పూర్ లో కిరాణ షాప్ నడిపే వ్యక్తి.. అక్కడ పనిచేసే పెళ్లైన మహిళకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో లవ్ లెటర్ ను ఆమె పై విసిరేశాడు. బాధితురాలు అకోలా పోలీస్ లకు కంప్లైంట్ చేసింది.

2018 లో సెషన్స్ కోర్టు నిందితునికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటుగా రూ.40 వేలు జరిమానా విధించింది. అయితే  ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టు కు వెళ్లాడు. బాధిత మహిళపైనే ఆరోపణలు చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని అడిగినందుకే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుందని అతను హైకోర్టులో తెలిపాడు. కాగా పక్కా ఆధారాలుండటంతో అతని వాదనలను కోర్టు తోసిపుచ్చింది. నిందితుడు 45 రోజుల పాటు జైలులో ఉన్నందున జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించింది. అయితే ఫైన్ మాత్రం రూ. 90 లకు పెంచింది. అందులో బాధితురాలికి రూ. 85 వేలు ఇవ్వాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *