నాగ్, పల్లవిల.. “లవ్ స్టోరీ”… సెప్టెంబర్ 10న

నాగ్, పల్లవిల.. “లవ్ స్టోరీ”… సెప్టెంబర్ 10న

నాగ్, పల్లవిల.. “లవ్ స్టోరీ”… సెప్టెంబర్ 10న

చిత్రం విడుదల సెప్టెంబర్ 10న 

టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలు తీయడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిట్ట.. పల్లెటూరిలోనే షూటింగ్, జానపదాలు ఉపయోగించి చిత్రాలు తీయడంలో శేఖర్ కమ్ముల స్టేలే వేరు. అయితే శేఖర్ కమ్ముల సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం తీసిన సినిమాయే ఈ లవ్ స్టోరీ.. అయితే కరోనా సెకండేవ్ ప్రభావంతో సినిమాను తొలుతగా ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కరోనా తగ్గు ముఖం పట్టడంతో సినిమా థియేటర్లు ఖాళీగా ఉండటంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నామని అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై భారీ అంచనాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

ఈ సినిమా విడుదల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదలచేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ముందుగానే విడుదల చేస్తామని తెలిపారు.

అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ములకు పల్లెటూరి వాతావరణంలో సినిమాలు తీయడమంటే ఆయనకు ఎవరు సాటిరారని చెప్పొచ్చు. దీనిలోని భాగంగానే ఈ చిత్రంలోని మేజర్ పార్టులన్నీ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసారట. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే  కె.నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు ఆధ్వర్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ గా పవన్ స్వరాలు అందిస్తోన్నాడు. లవ్ స్టోరి సినిమాలోని ` సారంగదరియా పాట` యూట్యూబ్‌లో 300 మిలియన్ (30 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపుతూనే ఉంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఉండే పోస్టర్ కూడా రిలీజ్ చేసిం చిత్రయూనిట్. ఈ సినిమాను శేఖర్ కమ్ముల కొత్తకోణంలో తీసారని.. ఈ చిత్రం ప్రేకక్షుల మదిలో స్థిరస్థాయిగా నిలిచిపోనుందని అంచనా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *