దీపావళికి… గ్యాస్ వినియోగదారులకు షాక్
ప్రతి ఇంట్లో అమ్మో ఒకటో తారీఖు వచ్చేస్తుందంటే భయం వేస్తోంది. దీంతో సామాన్యుడి నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది. దీపావళి పండుగకు ముందు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. అయితే కమర్షిల్, నాన్ కమర్షిల్ ధరలు ఇలా ఉన్నాయి. నవంబర్ 1 నుంచి వివిధ మెట్రోనగరాల్లో ఇలా ఉన్నాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. అయితే ఇంట్లో వాడే LPG సిలిండర్ ధర మాత్రం పెరగలేదు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.268 వరకు పెంచింది.
కమర్షిల్ ధరలు ఇలా ఉన్నాయి
- ఢిల్లీ: 19 కిలోల గ్యాస్ కొత్త ధర రూ.2,645, పాత ధర రూ.2000.50
- చెన్నై: 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.2,133, పాతది రూ.1867.50
- ముంబై: 19 కిలోల గ్యాస్ కొత్త ధర రూ.1,950, పాత ధర: 1,685.00
- కోల్కతా: 19 కిలోల కొత్త ధర రూ.2073.50, పాత ధర రూ: 1805.50
ప్రస్తుతానికి మాత్రం 14.2 కేజీల ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.990 సమీపంలో ఉంది. అయితే రానున్న రోజుల్లో ఈ సిలిండర్ ధర కూడా పెరగొచ్చనే నిపుణుల అంచనాలున్నాయి. అయితే తెలంగాణ, ఏపీ జిల్లాల్లో పెరిగే ధరలు ఆయా రాష్ట్రాల టాక్స్ ల ప్రకారం ఉంటుంది.