అక్టోబర్ 10న “మా” ఎన్నికలు.. జోరుగా ప్రచారం

అక్టోబర్ 10న “మా” ఎన్నికలు.. జోరుగా ప్రచారం

అక్టోబర్ 10న “మా” ఎన్నికలు.. జోరుగా ప్రచారం

తెలంగాణలో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పుడా..ఎప్పుడా అని తెలుగు సినీ పరిశ్రమే కాదు.. సినీ అభిమానులు, సమస్త ప్రజానీకం ఎదురుచూస్తోంది. అయితే రానే వచ్చాయి మా ఎన్నికలు ఖరారైంది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహిస్తున్న “మా” క్రమశిక్షణ సంఘం తెలిపింది. అయితే ప్రచారం కోసం అధ్యక్ష అభ్యర్థులతో పాటుగా ప్యానెల్ సభ్యులు ప్రచారం ముమ్మరంగా చేయడం మొదలు పెట్టారు.అయితే పోటీలో ఎవరు ఉంటారో..? ఎవరు విజయం సాధిస్తారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం మా అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజు, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, జీవితా రాజశేఖర్, హేమలు ఉన్నారని తెలిపింది మా క్రమశిక్షణా సంఘం. అయితే చివరి నిమిషంలో ఎవరు బరిలో ఉంటారో.. లేదో ఎవరికి తెలియదు. అయితే ఎవరినీ ఏకగ్రీవంగా చేస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే మా ఎన్నికలు ప్రధాన అజెండ.. మా కు కొత్త భవనం కావాలనే ఎన్నికలలో ప్రధాన ఎజెండాగా కొనసాగుతుందని తెలుస్తోంది. మా కార్యవర్గ సమావేశంలో క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే మా నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని..సినీ నటుడు మా అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ రాజ్ సూచించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించాలని మా అధ్యక్ష ‘మా’ క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి త్వరలో సమంత సినిమాలకు గుడ్ బై.. https://teluguword.com/good-by-cinemas/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *