సీసీ పుటేజ్ తో ఆ నిజాలు బయటకొస్తాయి: ప్రకాశ్ రాజ్

సీసీ పుటేజ్ తో ఆ నిజాలు బయటకొస్తాయి: ప్రకాశ్ రాజ్

సీసీ పుటేజ్ తో నిజాలు బయటకొస్తాయి: ప్రకాశ్ రాజ్

వివాదాల మధ్య మా ఎలక్షన్స్ జరిగాయి. చివరకు మంచు విష్ణు అధికార పీఠం చేపట్టారు. అయితే మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్యానల్ సభ్యులను గౌరవించి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందని చెప్పారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాకపోక, సభ్యులంతా రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. వివాదాలు సర్ధుమణుగుతాయని మా అధ్యక్షుడు విష్ణు చెప్పగా.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎలక్షన్‌‌పై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోమారు ఘాటైన విమర్శలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికలు జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రకాశ్ రాజ్. అయితే ఎలక్షన్ రోజు సీసీటీవీ వీడియో ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఈసీ కృష్ణ మోహన్‌ను కోరారు. ప్రకాశ్ రాజ్ ఊహించిన విధంగానే కృష్ణ మోహన్ సీసీటీవీ ఫుటేజీని చూపించారు. తన ఆలోచనలో ఉన్న వ్యక్తి కనపడేంత వరకు చూశారు. మిగతా సీసీసీటీవీ పుటేజ్ ను తరువాత చూస్తానని ఈసీకి చెప్పారు. ఇదే విషయంపై తాజాగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే నాకు ఆ సీసీసీ పుటేజ్ మొత్తం కావాలని ఈసీ కృష్ణని అడిగారు…ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ప్రపంచానికి చూపుతానని ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఇది కేవలం ప్రారంభమేనన్నారు.

సోషల్ మీడియా వేదికగా ఈ పరిణామాలన్నింటీని ట్వీట్‌కు ‘మా’ ఎన్నిక నాటి ఫొటోలను జత చేశారు. ఈ ఫొటోల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు తండ్రి, సీనియర్ హీరో మంచు మోహన్ బాబు పక్కన నూకల సాంబశివరావు అనే వ్యక్తి ఫోటో ఉండటాన్ని మనం గమనించవచ్చు. వైసీపీ కండువాతో జగన్ పక్కన ఉండటాన్ని కూడా గమనించొచ్చు. ఆంధ్రాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సదరు వ్యక్తిపై  జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ కేసులు ఉన్నాయని, అతడు పలు కేసుల్లో నిందితుడని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు సదరు కంప్లయింట్ కాపీని ఆయన ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *