MAA Elections: ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులంతా రాజీనామా!
ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులంతా రాజీనామా!
మా ఎన్నికలు ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గొడవల మధ్యే మా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే.
గెలిచినప్పటి నుంచి మా అసోసియేషన్ సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ప్రకాశ్ రాజ్.. “మా” ఎన్నికల్లో మా ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తొలి రోజు గెలిచినవారు..రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెటెల్ లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్యానల్ సభ్యులు రాజీనామాను మంచు విష్ణు ఆమోదించాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సంక్షేమం కోసమే మేము రాజీనామా చేశామని ఆయన తెలిపారు. మా లోనే కొనసాగుతానని, రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని ఆయన అన్నారు. అయితే బైలాస్‌లో బయటవాళ్లు పోటీ చేయకుండా మార్పు చేయవద్దు.. ఎవరైనా పోటీ చేయవచ్చు అన్నదానికి మా అధ్యక్షుడు మంచు విష్ణు ఒప్పుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ఆయన అన్నారు.