`మా` పోటీ నుంచి తప్పుకున్న జీవిత, హేమ, జయసుధ

`మా` పోటీ నుంచి తప్పుకున్న జీవిత, హేమ, జయసుధ

`మా` పోటీ నుంచి తప్పుకున్న జీవిత, హేమ, జయసుధ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల బరి నుంచి తప్పుకున్న హేమ, జీవితా రాజశేఖర్, సీనియర్ నటి జయసుధ… అయితే ఈ `మా` ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. సినిమాల్లోగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ.. గమ్మత్తైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మా ఎన్నికల బరిలో పోటీదారులుగా వున్నా జీవిత రాజశేఖర్, హేమలు తప్పుకున్నారు. ఇదే విషయంపై ప్రకాష్ రాజ్ స్వయంగా మీడియా ముఖంగా ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్ లోనే హేమ, జీవిత పేర్లు ఉంటడంతో ఫిల్మీం ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..‘ జీవిత రాజశేఖర్ తో 2 గంటలకు పైగా `మా` లో చేసే అభివృద్ధి కార్యక్రమాలపై ఆమెతో మాట్లాడాను. జీవితా రాజశేఖర్ కు నచ్చడంతో నా ప్యానెల్‌లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు.  ఇదే విషయంపై నటి హేమతో కూడా చర్చించగా ఆమె కూడా నా ప్యానెల్‌లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు’ అని ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

జీవిత రాజశేఖర్, హేమ, సీనియర్ నటి జయసుధలు కూడా ప్యానెల్ నుంచి తప్పుకున్నారు. అయితే జయసుధను మెయిన్ ప్యానెల్ లోకి తీసుకుందామని అనుకున్నానని.. నేను స్పోక్ పర్సన్ గా ఉంటానని తెలిపారు ప్రకాశ్ రాజ్. ఇదే విషయంపై మా గ్రూప్ ఉన్న సభ్యుల పేర్లు ప్రకాశ్ రాజ్ వివరిస్తూ.. జయసుధ, జీవిత, హేమ్, బండ్ల గణేష్, సాయి కుమార్, బెనర్జీ.. స్పోక్ పర్సన్ గా ఉంటామని ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.

సెప్టెంబర్ 19న మా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఆ తరువాత మళ్లా నేను ప్రెస్ మీట్ పెడతానని తెలిపారు. అప్పటి వరకు నేను స్పోక్స్ పర్సన్స్ మాత్రమే మీడియాతో మాట్లాడతారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే ఏ కారణం వల్ల తప్పుకున్నారనేది తెలియాల్సి ఉంది. ప్రకాష్ రాజ్ ను అడుగగా ఏమో నాకు తెలియదు.. అని తెలిపారు.

డ్రగ్స్ గురించి ప్రకాశ్ రాజ్: డ్రగ్స్ వాడకం అనేది చాల నేరమని.. దీనిపై ఈడీ విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. డ్రగ్స్ వాడకంపై ఆధారాలు దొరికితే తప్పా..నిజానిజాలు బయటకు రావని.. ఒకవేళ డ్రగ్స్ వాడకం ప్రూవ్ అయితే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రకాశ్ రాజ్ అన్నారు.

MAA భవనంపై ప్రకాశ్ రాజ్ కామెంట్: మంచు విష్ణు మా కు భవనం కావాలని అంటున్నారని… అయితే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే..”మా” కు భవనం కావాల్సి వొచ్చిందా అని ప్రశ్నించారు.. ఒక వేళ  విష్ణు చెప్పిందే కరెక్టు అనుకుంటే మా ఎన్నికల్లో విష్ణునే ఎన్నుకుంటారని ఆయన  తెగేసి చెప్పారు.

ప్రకాశ్ రాజ్ మెయిన్ ప్యానెల్ లోని సభ్యులు:

అధ్యక్షుడుగా: ప్రకాశ్ రాజ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్, ట్రెజరర్: నాగినీడు

జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్, ఉపాధ్యక్షుడు: బెనర్జీ

ఉపాధ్యక్షురాలు: హేమ, జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్

ప్రకాశ్ రాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్యానెల్ లోని సభ్యులు 18మంది

బ్రహ్మాజీ, యాంకర్ అనసూయ, నటుడు అజయ్, ఆర్గనైజర్ భూపాల్, ఈటీవీ ప్రభాకర్

గోవిందరావు, ఖయ్యూమ్, టీవీ నటుడు కౌశిక్, నటి ప్రగతి, రమణా రెడ్డి, శ్రీధర్ రావు

శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *