మా ఎన్నికల పూర్తి ఫలితాలు విడుదల…!

మా ఎన్నికల పూర్తి ఫలితాలు విడుదల…!

మా ఎన్నికల పూర్తి ఫలితాలు విడుదల…!

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానళ్ల మధ్య పోటాపోటీన ఎన్నికలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ 28 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన మూవీ ఆర్టిస్ అసోసియేష‌న్‌లో 883 మందికి ఓట్లు ఉన్నాయి. ఇందులో 605 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. మా ఎన్నికలకు హాజరుకాలేని 54 మంది పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు, ప్ర‌కాష్ రాజ్ ప్యానళ్ల మధ్య వాదోపవాదాలు మధ్య జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఎన్నికలు జరిగాయి. ఈ ట్విస్ట్ ల మధ్య మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజ‌యం సాధించారు.

కాగా, ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి పూర్తి ఫ‌లితాల‌ను ఈరోజు ప్ర‌క‌టించారు. ఫ‌లితాల ప్ర‌కారం ఎగ్జిక్యూటీవ్ అధ్య‌క్షుడిగా శ్రీకాంత్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ర‌ఘుబాబు, ట్రెజ‌ర‌ర్‌గా శివ‌బాలాజీ ఎంపిక‌య్యారు. జాయింట్ సెక్ర‌ట‌రీలుగా ఉత్తేజ్‌, గౌత‌మ్ రాజ్‌లు ఎంపిక‌వ్వ‌గా, వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల ర‌వి, బెన‌ర్జీలు ఎంపిక‌య్యారు.

ఇక ఇదిలా ఉంటే మొత్తం 18 మంది ఈసీ మెంబ‌ర్లుగా గెలిచిన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. ఇందులో 10 మంది మంచు విష్ణు ప్యాన‌ల్ నుంచి ఎంపిక‌వ్వ‌గా, ప్ర‌కాష్‌రాజ్ ప్యాన‌ల్ నుంచి 8 మంది ఎంపిక‌య్యారు. గీతాసింగ్‌, అశోక్ కుమార్‌, శివారెడ్డి, శ్రీల‌క్ష్మి, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాక‌ర్‌, మానిక్‌, త‌నీష్‌, శ్రీనివాసులు, సురేష్ కొండేటి, హ‌రినాథ్ బాబు, శివ‌నారాయ‌ణ‌, సంపూర్నేష్‌బాబు, సుడిగాలి సుధీర్‌, శ‌శాంక‌, స‌మీర్‌,బొప్పాల విష్ణు, కౌశిక్ లు ఈసీ మెంబ‌ర్లుగా విజ‌యం సాధించారని మా ఎన్నికలు నిర్వహించిన  అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: