“మా” సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

“మా” సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

‘మా’ అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. అయితే పోటీలో ఇరు ప్యానళ్ల మధ్య వాదోపవాదుల మధ్య మా ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి మంచు విష్ణు సినీ కార్మికులకు పథకాల రూపంలో అందరినీ ఆకర్షిస్తున్నారు. దీనిలో భాగంతా తాను లోకల్ అని, నాన్ లోకల్ అనే వాటిపై ఫోకస్ చేశారు. దీంతో ఆర్టిస్టులకు పథకాలపై ఆసక్తి కలిగిందనే చెప్పొచ్చు. అందుకే మంచు విష్ణుని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇరు ప్యానళ్ల మధ్య జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో ఎట్టకేలకు మంచు విష్ణు విజయపతాకం ఎగరేసి ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే విష్ణు ప్యానల్ భారీ మెజార్టీ ఓట్లతో గెలవడానికి ముఖ్యకారణం ప్రాంతీయవాదం అని చెప్పొచ్చు. ‘మా’ సభ్యులు కూడా అదే కోరుకున్నారు. అందుకే విష్ణుకు ‘మా’ అధ్యక్షుడిగా పట్టం కట్టారు.

ఈ ఎన్నికల్లో మంచు విష్ణు మీ మద్దతు కావాలని సీనియర్ నటులు కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణ, కోట శ్రీనివాస్ రావు లాంటి లాపెద్దలను కలిసి అడిగారు. అయితే దీని భిన్నంగా ప్రకాష్ రాజ్ తనకు ఎలాంటి పెద్దల సపోర్ట్ అవసరం లేదు అంటూ.. దూకుడుగా ముందుకు సాగారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకే నంటూ మొదటి నుంచి మంచు విష్ణు చెప్తున్నా.. ఇందుకు భిన్నంగా మెగా ఫ్యామిలి నుంచి మాత్రం నాగబాబు ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేశారు. అయితే ఈ ఆస్తికర సన్నివేశాల మధ్య మొత్తానికి ఎన్నికలు పూర్తయ్యాయి.

అయితే ఈ ఫలితాలు మెగా ఫ్యామిలో నాగబాబును నిరాశ పర్చింది. అలా అనుకున్న వాళ్లకు మా ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఈ పరిణామాల మధ్య ‘మా’కు రాజీనామా చేస్తున్నాను అంటూ నాగబాబు ప్రకటించారు. మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని తీసుకొచ్చి గెలిచారని నాగబాబు అభిప్రాయం. ఇలాంటి సంకుచిత భావాలతో కొట్టు-మిట్టులాడుతున్న “ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్“ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా…ఇక సెలవు అంటూ నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *