మాయోన్ టీజర్ ను విడుదల చేసిన దగ్గుబాటి

మాయోన్ టీజర్ ను విడుదల చేసిన దగ్గుబాటి

మాయోన్ టీజర్ ను రానా దగ్గుబాటి రీలీజ్ చేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సిబి సత్యరాజ్,  తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం మయోన్.తాన్యా రవిచంద్రన్, దాతో రాధా రవి కీలకపాత్ర పోషించారు. కొత్త డైరెక్టర్ కిషోర్ ఎన్ రూపొందిస్తున్న చిత్రం “మాయోన్” చిత్రం, ఇటీవల విడుదల చేసిన తమిళ టీజర్ కు మంచి రెస్పాన్ప్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు టీజర్ ను లాంచ్ చేశారు చిత్ర యూనిట్.

ఐదేళ్ల క్రితం నాటి ఒక దేవాలయం మిస్టరినీ చేధించే కథాశంతో ఈ థ్రిలర్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్, టెక్నికల్ విలువలతో ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్థ మవుతుంది. ఈ మూవీ మొత్తం కూడా నిధి కోసం వెళ్ళే యువకుల టీంకు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలు, ధైర్య సాహసాలతో కూడిన కథాంశంగా తెరకెక్కించారు. ఈ మిస్టరీ థిల్లర్ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆసక్తికర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిసున్నారు. కెమెరామెన్ రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్ అధ్బుతంగా ఉన్నాయని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్ పై అరుణ్ మోజీ మనిక్కమ్ నిర్మిస్తున్నారు. ఇంకోక విశేషమేమిటంటే మాయోన్ మూవీకి నిర్మాత, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా బాల సుబ్రహ్మణ్యం వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్ ను రామ్ పాండియన్, కొండలరావు నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ను రానా దగ్గుబాటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మాయోన్” టీజర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన రానా.. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ “మాయోన్” మూవీ విజయవంతం కావాలని కోరుకున్నారు. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. పూర్తి సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రానా తెలిపారు.

మరోవైపు రానా దగ్గుబాటి ప్రస్తుతం “భీమ్లా నాయక్” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రానా-పవన్ కళ్యాణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘డేనియల్ శేఖర్’ పాత్రతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొప్రక్క రానా ప్రధాన పాత్రలో నటించిన “విరాట పర్వం” కూడా విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ లలో బిజిగా ఉన్న రానా ఈ పోస్టర్ విడుదల చేయడం మరో విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *