శరన్నవరాత్రులు మహిషాసురమర్దనీ దేవి అలంకరణ
శరన్నవరాత్రులు మహిషాసురమర్దనీ దేవి అలంకరణ
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
దేవి వాహనం: సింహ వాహనం
దేవీ రూపం: మహాశక్తి రూపం
అమ్మవారి వస్త్రాలు: ఎరుపు లేదా, ముదురు రంగు నీలం
నివేదన: చిత్రాన్నము, పాయసాన్నం, గారెలు, వడపప్పు, పానకము
సువాసినులూ: ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగు చీరను ధరించవచ్చును…
ఏ పూజ చేసుకోవాలి: ఆయుధ పూజ చేసుకోవాలి
ఏ హోమము చేయాలి: చండీ సప్తశతీ హోమము
ఏఏ పూజ చేయాలి: లలిత పారాయణ, మహిషాసుర మర్ధిని స్తోత్రం, అష్టోత్తరం
తో కుంకుమ అర్చన చేసుకుంటే మంచిది
మహిషాసురమర్దనీ దేవి కథ:
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
మహిసాసుర మర్దిని దుర్గామాత విగ్రహం
దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురా ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహా నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు.
మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు విధాతా అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడ్డాడు.. సరే ఆడది నా దృష్టిలో అబల ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు.
బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు, సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరుసల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు , మహాహనుడు , అసిలోముడు , బాష్కలుడు , బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.
ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము , మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలు కొలుస్తారు.
ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటిని దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు.
ప్రస్తుత కాలంలో ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు.
విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధన రూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ నూతన వస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అనావాయితిగా వస్తుంది.
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.
మహిషాసురమర్దిని స్తోత్రం
అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుంఠుంభిని భూరి కుఠుంభిని భూరి కృతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే
సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖ మర్షిని హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖః నివారిణి సిందుసుతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే
అయి జగ దంబక దంబవ నప్రియ వాసవి లాసిని వాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగని జాలయ మధ్యగతే
మధు మధురే మధు కైటభ భంజని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే
అయి శరఖండ విఖందిట రుండా వితుందిట శుండా గజదిపతే
రిపు గజ గండ విదరణ కాండ పరాక్రమ శుండా దుర్గదిపతే
నిజ భుజ దండ నిపతిత ఖండ విపతిత ముండ భట దిపతే
జయ జయ హే మహిషాసుర మర్ధిని రంయక పర్ధిని శైలసుతే
అయి రణ దుర్మద శత్రు వదోదిట దుర్ధర నిర్జర శక్తిబ్ర్తే…..
ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రాన్ని జపించండి..
శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోండి.. సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున ఆయుధ పూజ చేస్తే చాలా మంచిది.