సరికొత్త మోడల్.. Mahindra XUV 700 వచ్చేసింది..

సరికొత్త మోడల్.. Mahindra XUV 700 వచ్చేసింది..
ధర రూ.11.99 లక్షల నుంచి
మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త SUV మోడల్ ‘XUV 700’ను వెలుగులోకి ప్రవేశపెట్టింది. కొత్త లోగోతో మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ-700. విదేశీ కార్లు అందించే ప్రీమియం ఫీచర్లతో దేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి రీలీజ్ చేసింది. ఎంతో కాలంగా ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న ఎక్స్‌యూవీ 700కి సంబంధించిన ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది. అయితే దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఏడు సీట్లు, అయిదు సీట్ల వేరియంట్లలో ఎక్స్‌యూవీ 700 లభించనుంది. డీజిల్, పెట్రోల్, గ్యాసోలిన్ వెర్షన్లను కంపెనీ అందుబాటులో తెచ్చింది.
XUV-700లో ఫీచర్లు: కారులో ఉండే స్పెషల్ వేరియంట్లను కంపెనీ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిస్తూ మహీందద్రా ఎక్స్‌యూవీ 700ని రిలీజ్ చేసింది. ఈ కారు ఫ్యూచర్లు వాహనదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీ అనేక రకాల మోడళ్లను ప్రవేశపెట్టింది. ఎంఎక్స్ (బేస్), ఏఎక్స్-3, ఏఎక్స్-5, ఏఎక్స్-7 వేరియంట్లలో కార్లు లభిస్తాయి.
SUV మోడల్ ‘XUV 700 పెట్రోల్ : పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.
డీజిల్: ఈ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారులో ఫ్యూచర్లు ఇలా ఉన్నాయి: జిప్, జాప్, జూమ్, కస్టమ్ అనే మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. డ్రైవర్‌తో పాటు పక్కన ఉండే ప్యాసింజర్ కోసం ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. 99 శాతం బ్యాక్టీరియా, 95 శాతం వైరస్‌లను ఫిల్టర్ ఔట్ చేయగల వ్యవస్థను అమర్చారు. ఎక్స్‌యూవీ 700లో 7 సీట్, 5 సీట్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయి. హై ఎండ్ మోడల్లో 360 డిగ్రి కెమెరా, సోని 3డీ సౌండ్ సిస్టమ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త కారు కారు ప్రియులను బాగా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు.. బుక్సింగ్ త్వరలో పండుగకు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.