Mahindra XUV700 కొత్త కారు.. 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు

మహీంద్రా కొత్త కారు.. 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు

ఢిల్లీ: ప్రముఖ కార్లలో తయారీ సంస్థల్లో మహీంద్రా కంపెనీ ఒకటి.

ప్రముఖ కార్లలో తయారీ సంస్థల్లో మహీంద్రా కంపెనీ ఒకటి. మర్కెట్లోకి ఎన్నో కొత్త రకాల మోడళ్ల కంపెనీల పేర్లతో కార్లు తయారైన.. ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కార్లపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కార్ల ప్రియులు. ఈ కార్ల ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ కారు XUV700కు మంచి క్రేజ్‌ లభిస్తోంది. ఈ కారు బుకింగ్స్ ను గురువారం ప్రారంభించగా హాట్‌కేకుల్లా బుక్‌ అయ్యాయి. కేవలం 57 నిమిషాల్లోనే 25వేల బుకింగ్స్‌ వచ్చినట్లు కంపెనీ సదరు కంపెనీ వెల్లడించింది. బహుశా ఏ కంపెనీ కార్లు కూడా ఈ రేంజ్ లో ఆర్డర్లు వచ్చిఉండవేమో..

‘‘XUV 700 కోసం 7-10-2021న ఉదయం 10 గంటలకు బుకింగ్స్‌ తెరిచామని కంపెనీ తెలిపింది. 57 నిమిషాల్లోనే 25వేల మంది XUV 700కారును బుక్‌ చేసుకున్నారు. ఈ కారుకు వచ్చిన స్పందన చూసి ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ సీఈవో విజయ్‌ నక్రా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో పాటుగా మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కూడా ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

మా వాహనాలను నడిపై కస్టమర్లకు మా మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ సంస్థపై ఎంత నమ్మకం ఉందో, తమ భుజాలపై ఎంత బాధ్యత ఉందో దీన్ని చూస్తుంటే.. అర్థమవుతుందని సీఈవో విజయ్‌ నక్రా తెలిపారు.

సెప్టెంబరు నెలాఖరులో XUV700 కారును విడుదల చేశారు.

Model: XUV700 వేరియంట్ ధర (ex showroom price) రూ.11.99లక్షలు

Model: Top వేరియంట్ (ex showroom price)ధర రూ.21.09లక్షలు

Fuel: పెట్రోల్, డిజిల్ ఇంజిన్లు, Varients: 9 , Futures : ఆల్‌వీల్‌ డ్రైవ్‌ ఫీచర్‌ , Seats Capacity:  5, 7 సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది.

ఇతర ఫీచర్లు: ఈ వాహనంలో అధునాతన హెడ్ ల్యాంపులకు ఎల్ఈడీ లైటింగ్ ను పొందుపరిచారు. వీటితో పాటు సీ-ఆకారపు ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్లను అమర్చారు. 18-అంగుళాల అల్లాయ్ ల్యాంపులు, రూఫ్ రెయిల్స్ షార్క్ ఫిన్ యాంటెనా, రూఫ్ స్పాయిలర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్

ఈ ఎస్ యూవీలో 10.25 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ఉంది. అంతేకాకుండా ఇంఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, పవర్ ఆపరేటెడ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అమెజాన్ అలెక్సా, 60కుపైగా కనెక్టెడ్ ఫీచర్లు, ఈ-సిమ్ ఆధారిత కనెక్టెడ్ టెక్నాలజీ, వాయిస్ అసిస్ట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు, మూడో వరుసలో కూడా ఏసీ వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైర్ తో పాటుగా మిడిల్ వరుస బెంచ్ మాదిరిగా ఉంది. కారు మొత్తం లెదర్ తో రూపొందించారు. అతిపెద్ద పానోరామిక్ సన్ రూఫ్ తో క్యాబిన్ లో ఎయిరీ ఫీల్ పొందుతారు.

సెఫ్టీ పరంగా: ఫార్వార్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోనోమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టీవ్ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ పైలట్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ డ్రౌసినెస్ డిటెక్షన్, ఇవి కాకుండా 7 ఎయిర్ బ్యాగులు, మూడు వరుసలకు కర్టెన్ ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ నీ ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ & సహా ప్రయాణీకులకు ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ సీట్- బెల్ట్ ల్యాప్ ప్రీ టెన్షనర్, ఏబీఎస్ తో కూడిన ఈబీడీ లాంటి ఇతర భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి.

ఇతర యాక్సెసిరీస్: ఎలక్ట్రీకల్లీ డిప్లాయిడ్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, సోనీ 3డీ సౌండ్, 360 సరౌండ్ వ్యూ, బ్లై వ్యూ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్, వైర్లెస్ ఛార్జింగ్

భారత మార్కెట్లో ఈ మహీంద్రా ఎక్స్ యూవీ700కు పోటీగా.. ఎంజీ హెక్టార్ ప్లస్,టాటా సఫారీ, త్వరలో రానున్న జీప్ మెరిడియన్ లాంటి ఎస్ యూవీలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *